ప్రముఖ హిందీ, గుజరాతీ నటుడు రసిక్ దవే కన్నుమూశారు. కొంత కాలంగా ఆయన మూత్రపిండాల సంబంధిత వ్యాధితో పోరాడుతున్నారు. ఈ క్రమంలో పరిస్థితి విషమించి ఆస్పత్రిలో కన్నుమూసినట్లు రసిక్ దవే బంధువు, ప్రముఖ నటి సరితా జోషి తెలిపారు. ఆయన సతీమణి నటి కేత్కి దవే. వీరికి కుమార్తె రిద్ధి దవే, కుమారుడు అభిషేక్ ఉన్నారు.
సినీ పరిశ్రమలో విషాదం.. మరో సీనియర్ నటుడు కన్నుమూత - Rasik Dave wife ketki dave
భారత చిత్ర పరిశ్రమ మరో నటుడిని కోల్పోయింది. ప్రముఖ సీనియర్ నటుడు రసిక్ దవే కన్నుమూశారు.
సినీ పరిశ్రమలో విషాదం.. మరో సీనియర్ నటుడు కన్నుమూత
గుజరాత్ షోలతో రసిక్ దవే చాలా పాపులర్ అయ్యారు. 'దేవ్‌కు రక్తపోటు, మూత్రపిండాల సమస్యలు ఉన్నాయి. అతను డయాలసిస్‌లో ఉన్నాడు. దాదాపు 15 నుంచి 20 రోజులు ఆసుపత్రిలో ఉన్నారు. గురువారం ఇంటికి తీసుకొచ్చారు. మరుసటి రోజు రాత్రికే ఆయన మరణించారు' అని జోషి తెలిపారు. 1982లో 'పుత్ర వధు' అనే గుజరాతీ చిత్రంతో తన కెరీర్‌ను ప్రారంభించారు దవే.
ఇదీ చదవండి:'బాలీవుడ్ మాఫీయా అంటే వాళ్లే'.. పేర్లు చెప్పేసిన తనుశ్రీ దత్తా