Indian Box Office Collections 2023 : ప్రస్తుతం కోలీవుడ్, బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్లో సీనియర్ హీరోల హవా బాగా కొనసాగుతోంది. నిజానికి 60 ఏళ్లు వచ్చిందంటే హీరోలుగా రిటైర్ అయిపోతారు. ఇతర క్యారెక్టర్లు చేసుకుంటుంటారు. కానీ ఇప్పుడా పరిస్థితి అస్సలు కనపడట్లేదు. తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల్లో సీనియర్ హీరోలు సత్తా చూపిస్తున్నారు. తమ క్రేజ్, ఎనర్జీ ఏమాత్రం తగ్గలేదని తమ సినిమాలతో నిరూపించుకుంటున్నారు.
కోలీవుడ్ విషయానికి వస్తే... యూనివర్స్ స్టార్ కమల్ హాసన్, సూపర్ స్టార్ రజనీకాంత్ వంటి సీనియర్ హీరోలు ఇంకా స్టార్ డమ్‌ను కొనసాగిస్తూ సినిమాలు చేస్తున్నారు. రీసెంట్గా విక్రమ్‌తో వచ్చిన కమల్‌హాసన్ ఇండియావైడ్‌గా రూ.400కోట్లకు పైగా వసూళ్లను అందుకున్నారు. తాజాగా రజనీకాంత్ జైలర్(jailer world wide collections) కూడా విడుదలైన మూడు రోజుల్లో రూ.400కోట్లకు పైగా కలెక్షన్లను అందుకుంది. ఈ టార్గెట్స్‌ను అందుకోవడానికి అక్కడ ఇతర స్టార్ హీరోలైన విజయ్, అజిత్, ధనుశ్ వంటి వారు ఇంకా ప్రయత్నాలు చేయాల్సి వస్తోంది.
తెలుగు హీరోల్లో మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ ఇప్పటికీ యంగ్ హీరోలకు గట్టి పోటినిస్తున్నారు. తాజాగా చిరు భోళాశంకర్, ఆ మధ్యలో ఆచార్య డిజాస్టర్లుగా నిలిచాయి కానీ.. వాల్తేరు వీరయ్య ఏకంగా రూ.200కోట్లను అందుకుంది. గాడ్ ఫాదర్ సినిమా కూడా బానే ఆడింది. ఇక బాలయ్య అఖండ, వీరసింహారెడ్డి రూ.100కోట్లకు పైగా వసూళ్లను అందుకుంది. ఒకరకంగా చూస్తే.. వీరందరూ కూడా తమ సినిమాలతో కుర్ర హీరోలకు గట్టి పోటినిస్తున్నారనే చెప్పాలి.
బాలీవుడ్‌లోనూ ఇదే హావా నడుస్తోంది. 60ఏళ్లకు చేరువలో ఉన్న బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ ఇంకా తన స్టార్ ఇమేజ్ను అలానే కొనసాగిస్తున్నారు. ఆ మధ్య పఠాన్‌తో రూ.1000కోట్ల వసూళ్లను అందుకున్న కింగ్ ఖాన్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించారు. ఎన్నో వరుస ఫ్లాప్‌లను అందుకున్న 55ఏళ్ల అక్షయ్ కుమార్ తాజాగా ఓమైడా గాడ్ 2తో(akshay kumar oh my god 2 collections) మళ్లీ సక్సెస్ ట్రాక్‌లోకి అడుగుపెట్టారు. అలాగే సన్నీదెవోల్ కూడా తాజాగా రిలీజైన గదర్ 2తో(sunny deol gaddar 2 movie collections) ఇప్పటివరకు దాదాపు రూ.200కోట్ల వరకు వసూలు చేశారు. ఇంకా ఓమై గాడ్ 2, గదర్ 2 సినిమాలు సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతున్నాయి. అలా ఈ సీనియర్ హీరోలు 60కు చేరువలో ఉండి, అలాగే 60 దాటిన కూడా రిటైర్మెంట్ తీసుకుకోకుండా రిలాక్స్‌గా ఉండకుండా కుర్ర హీరోలకు గట్టి పోటినిస్తున్నారు.