తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

ఉప్పొంగిన అభిమానం, అమెరికాలో ఇంటి ముందు స్టార్​ హీరో విగ్రహం - Amitabh Bachchan statue at New Jersey home

ఓ స్టార్​ హీరోకు అరుదైన గౌరవం లభించింది. అమెరికాలోని ఓ ఇండోఅమెరికన్​ ఫ్యామిలీ ఆయనపై తమకున్న అభిమానాన్ని చాటుకుంది. తమ ఇంటి ముందు భారీ సైజులో ఆ కథానాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఓ పండగలా సంబరాలు చేసుకుంది.

amitab bachan statue
అమెరికాలో అమితాబ్​ విగ్రహం

By

Published : Aug 29, 2022, 11:22 AM IST

Amitabh Bachan Statue: తమ అభిమాన హీరోల కోసం ఏం చేయడానికైనా ఫ్యాన్స్ వెనకాడరు. చాలా రకాలుగా అభిమానాన్ని చాటుకుంటూ ఉంటారు. ఆ కథానాయకుల ఫ్లెక్సీలకు, కటౌట్లకు పాలాభిషేకాలు చేయడం, ఇంకొంతమైంది అయితే ఏకంగా భిన్నమైన రీతిలో దేవాలయాలు కూడా కట్టించి పూజలు చేస్తారు. ఇప్పుడు ఇలాంటిదే సంఘటన మరొకటి జరిగింది. బాలీవుడ్​ దిగ్గజ నటుడు అమితాబ్​ బచ్చన్​పై తమకున్న అభిమానాన్ని ఓ కుటుంబం కూడా ఇలానే వినూత్న రూపంలో చాటుకుంది. ఆయన కోసం ప్రత్యేకంగా తమ ఇంటిముందు ఓ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేసింది.

అమెరికాలో అమితాబ్​ విగ్రహం

అమెరికా న్యూజెర్సీలోని ఎడిసన్ సిటీలోని ఇంటర్నెట్​ సెక్యురిటీ ఇంజనీర్​ గోపి సేథ్​ అనే భారతీయ వ్యక్తి నివాసముంటున్నాడు. తనతో పాటు అతడి కుటుంబానికి కూడా బిగ్​బీ అంటే విపరీతమైన అభిమానం. అందుకే అతడు బిగ్​బీ స్టైల్​గా కూర్చున్న రూపంలో ఓ విగ్రహాన్ని తన ఇంటి ముందు ఆవిష్కరించాడు. ఆ విగ్రహాన్ని ఓ పెద్ద గ్లాస్​ బాక్స్​లో ఉంచారు. గ్రాండ్​గా జరిగిన ఈ వేడుకకు దాదాపు 600 మంది హాజరై సందడి చేశారు. బాణాసంచా కాలుస్తూ సంబరాలు చేసుకున్నారు. డ్యాన్స్​లు వేస్తూ సరదాగా గడిపారు. దీనికి సంబంధించిన ఫొటోలను గోపిసేత్​ తన సోషల్​మీడియాలో పోస్ట్ చేశారు.

అమెరికాలో ఇంటి ముందు స్టార్​ హీరో విగ్రహం

"1991 న్యూ జెర్సీలోని నవరాత్రి ఉత్సవాల సమయంలో తొలిసారి బిగ్​బీని కలిశాను. అప్పటి నుంచి ఆయనకు వీరాభిమానిని అయ్యాను. నాకు నా భార్యకు ఆయన దేవుడు లాంటి వారు. రీల్​లైఫ్​లోనే కాదు రియల్​ లైఫ్​లోనూ ఆయన మాట్లాడే విధానం, ఉండే విధానం నాలో ఎంతో స్ఫూర్తిని నింపింది. ఆయన ఉన్నత స్థాయికి ఎదిగిన ఒదిగి ఉండే మనిషి. తన అభిమానుల సంక్షేమాలు చూసుకుంటారు. మిగతా స్టార్స్​లా కాదు ఆయన. ఎంతో ప్రత్యేకం. అందుకే నా ఇంటిముందు ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశాం" అని గోపీ సేథ్ అన్నారు.

అమెరికాలో ఇంటి ముందు స్టార్​ హీరో విగ్రహం

ఇదీ చూడండి: నాగార్జునకు ఆ తేదీ అంటే వెరీ స్పెషల్​, ఎందుకో తెలుసా

ABOUT THE AUTHOR

...view details