గత కొద్దికాలంగా వస్తున్న సినిమాల్లో ట్రెండ్ మారినట్టు కనిపిస్తోంది. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ అనే భేదం లేకుండా స్టార్ హీరోల చేత గన్ పట్టిస్తున్నారు ఆయా దర్శకులు. సినిమాల్లో హీరోలు గన్‌తో రౌడీలను షూట్ చేస్తుంటే థియేటర్లలో ఫ్యాన్స్ విజిల్స్ వేయాల్సిందే. అలా ఒక్క దెబ్బకే హీరోలు విలన్ల భరతం పడుతుంటే ప్రేక్షకులు పూనకాలు ఊగిపోతున్నారు. అయితే ఆడియెన్స్ పల్స్ తెలుసుకున్న మూవీమేకర్స్ కూడా సినిమాల్లో 'గన్ పోస్టర్'లనే హైలైట్ చేసి చూపిస్తున్నారు. మరి ఆ పోస్టర్లపై ఓ కన్నేద్దామా..
Jailer Movie : తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ - తమన్నా జంటగా నటిస్తున్న చిత్రం జైలర్. ఈ సినిమా ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా మూవీయునిట్ రజనీ క్రేజ్‌కు గన్ జోడించి.. సినిమాపై అంచనాలు పెంచేశారు.
Dhanush Captain Miller : ధనుష్ హీరోగా, డైరెక్టర్ అరుణ్ మతేశ్వరణ్ తెరకెక్కిస్తున్న చిత్రం కెప్టెన్ మిల్లర్. ఈ సినిమా పోస్టర్లో హీరో ధనుష్ ఓ భారీ గన్ను పట్టుకొని రౌద్రంగా కనిపిస్తున్నారు.
Bhola Shankar : టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి గాడ్‌ఫాదర్, వాల్తేరు వీరయ్య సినిమాల్లో గన్ పట్టుకొని ఫ్యాన్స్‌ను అలరించారు. తాజాగా భోళా శంకర్‌లోనూ చిరంజీవి.. రెండు చేతుల్లోనూ ఏకే 47 లాంటి గన్స్‌తో విలన్స్‌పై దాడికి వెళ్తున్నట్లుగా ఉన్న పోస్టర్‌ను రిలీజ్ చేశారు.
Jawaan : బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్.. జవాన్సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ప్రేమ కథ చిత్రాలు తీసే దర్శకుడు అట్లీ.. ఈ సినిమాలో ఫుల్ మాస్ టచ్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ సినిమా సెప్టెంబర్‌లో రిలీజ్ కానుంది.
Salaar : రెబల్ స్టార్ ప్రభాస్ - ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రాబోతున్న చిత్రం సలార్. ఈ సినిమాపై ముందు నుంచే అంచనాలు పీక్స్‌లో ఉన్నాయి. తాజాగా ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్‌ను కూడా రిలీజ్ చేశారు మేకర్స్. ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. కాగా ఈ సినిమా పోస్టర్లో.. మాస్‌లుక్‌లో ప్రభాస్ అదిరిపోయారు.