Indian 2 Shooting :లోక నాయకుడు కమల్ హాసన్.. స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ 'ఇండియన్ 2'. 90స్లో బ్లాక్ బస్టర్ టాక్ అందుకున్న 'ఇండియన్-1'కు సీక్వెల్‌గా రూపొందుతున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. అయితే ఇప్పటికే పలు మార్లు ఈ సినిమా చిత్రీకరణ వాయిదా పడగా.. తాజాగా మరో షెడ్యుల్‌తో శంకర్ టీమ్ రంగంలోకి దిగనుంది. ఈ క్రమంలో ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ విజయవాడలో జరగనుంది. ఇందుకోసం ఇప్పటికే శంకర్ కొన్ని లొకేషన్స్‌ను ఖరారు చేశారని సమాచారం.
దాదాపు పదిరోజుల పాటు సాగే ఈ చిత్రీకరణలో కమల్‌తో పాటు ఇతర నటీనటులు పాల్గొననున్నారట. ఇక్కడే శంకర్ ఓ క్రేజీ సీక్వెన్స్‌ను తెరకెక్కించేందుకు ప్లాన్ చేశారట. ఇక ఈ షూటింగ్ కోసం సుమారు 8000 వేల మంది జూనియర్ ఆర్టిస్ట్‌లను తీసుకున్నట్టు సమాచారం. ఇక విజయవాడ షెడ్యూల్ తర్వాత వైజాగ్‌లో కూడా కొంత షూటింగ్ జరుగుతుందని సమాచారం.
Indian 2 Movie Cast : ఇక ఇండియన్-2 సినిమా విషయానికి వస్తే.. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సిద్దార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, కాజల్ అగర్వాల్, ప్రియా భవాని, వెన్నెల కిశోర్, బ్రహ్మానందం లాంటి స్టార్స్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత సుభాస్కరణ్ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచంద్రన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. రత్నవేలు, రవి వర్మ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.