Highest Paid OTT Star In India : గత కొంత కాలం నుంచి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌కు మంచి ఆదరణ లభిస్తోంది. ఎప్పటినుంచో ఈ వెబ్ కంటెంట్ ఉన్నప్పటికీ కొవిడ్ కారణంగా ఈ ప్లాట్‌ఫామ్స్‌కు మరింత డిమాండ్ పెరిగింది. ఆ సమయంలో థియేటర్లు మూతపడటం కూడా ఈ ఓటీటీల వైపు ఆడియెన్స్ మొగ్గు చూపించేందుకు ఓ కారణమయ్యింది. అలా మొదలైన ట్రెండ్ ఇప్పటికీ కొనసాగుతోంది. దీంతో మూవీ టీమ్ కూడా థియేటర్ ఆడియెన్స్‌తో పాటు నెటిజన్లను దృష్టిలో పెట్టుకుని సినిమాలను తెరకెక్కిస్తున్నారు. దీంతో ఓటీటీల ప్రాధాన్యతను గుర్తించిన బడా స్టార్స్ కూడా ఓటీటీ సినిమాలు, వెబ్‌సిరీసుల్లో నటించేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అజయ్ దేవగన్, సైఫ్ అలీ ఖాన్, తమన్నా, నవాజుద్దీన్ సిద్ధిఖీ, సోనాక్షి సిన్హా, సమంత, నాగ చైతన్య, రాశీఖన్నా, విజయ్ సేతుపతి లాంటి స్టార్స్ వంటి స్టార్స్ ఓటీటీ వేదికలపై తళుక్కుమంటున్నారు.
మరోవైపు నెట్‌ఫ్లిక్స్, డిస్నీ+ హాట్‌స్టార్, జీ5, సోనీలివ్, అమెజాన్ ప్రైమ్, జియో సినిమా వంటి ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్ భారత్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లుగా మెరుస్తున్నాయి. కొత్త సినిమాలను కొనుగోలు చేసుకోవడమే కాకుండా సొంత కంటెంట్‌ను ప్రొడ్యూస్ చేస్తూ నెట్టింట సందడి చేస్తున్నాయి. దీంతో నిర్మాతలు కూడా తమ సినిమా, సిరీస్‌లకు అగ్ర తారల మెరుపులు కావాలంటున్నారు. దీంతో ఆయా స్టార్స్ కూడా సినిమాలకు సరిసమానంగా వెబ్ దునియాలోనూ మంచి పారితోషికాన్ని అందుకుంటున్నారు.