India Box Office Collection 2023 August : ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా రోజుల తర్వాత థియేటర్లన్నీ కళకళలాడుతున్నాయి. అందుకు కారణం వివిధ భాషల చిత్రసీమలో ఒక్కో స్టార్ హీరో సినిమా రిలీజై బ్లాక్ బస్టర్‌గా నిలవడమే ఇందుకు కారణం. ఒక్కో చిత్రం భారీ స్థాయిలో వసూళ్లను అందుకుంటున్నాయి. కొత్త రికార్డులను నెలకొల్పుతున్నాయి. గత వారం టాలీవుడ్, కోలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ పలు ఆసక్తికర సినిమాలు రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. రజనీకాంత్ 'జైలర్', చిరంజీవి 'భోళా శంకర్', అక్షయ్ కుమార్ 'ఓ మై గాడ్2', సన్నీ దేఓల్ 'గదర్2' విడుదలయ్యాయి. అయితే ఈ చిత్రాల్లో చిరు భోళాశంకర్ తప్ప మిగతా మూడు కూడా హిట్ అయ్యాయి.
ఆగస్టు 11 నుంచి 13 వరకూ ఈ నాలుగు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద వసూళ్లు చేసిన వివరాలు బయటకు వచ్చాయి. ఏకంగా రూ.390 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను అందుకున్నాయట. ఈ విషయాన్ని ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా తెలిపింది. ఇండియన్ సినిమా హిస్టరీలో ఒక వీకెండ్‌లో ఇన్ని కోట్ల వసూళ్లు రావడం ఇదే తొలిసారి అని పేర్కొంది. పైగా ఈ వీకెండ్‌లో దేశవ్యాప్తంగా 2.10 కోట్ల మంది సినీ ప్రియులు థియేటర్‌లో సినిమాలను వీక్షించారని తెలిసింది. గత పదేళ్లలో ఈ స్థాయిలో ఆడియెన్స్ థియేటర్‌కు రావడం ఓ రికార్డగా పేర్కొంది ప్రొడ్యూసర్స్ గిల్డ్. కరోనా తర్వాత ఈ స్థాయిలో థియేటర్లకు ప్రేక్షకులు రావడం ఎంతో ఆనందంగా ఉందని ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు శిబాశీష్ సర్కార్, మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు కమల్ ఆనందం వ్యక్తం చేశారు.ో