తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

అగ్రస్థానంలో 'కాంతారా'.. కేజీయఫ్​, ఆర్​ఆర్​ఆర్​, బాహుబలి ఎంతంటే? - కేజీయఫ్​ ఐఎమ్​డీబీ రేటింగ్​

'కాంతారా' సినిమా మరో ఘనత సాధించింది. ఆ జాబితాలో బాహుబలి, కేజీయఫ్​, ఆర్అర్​ఆర్​ సినిమాలను దాటేసి అగ్రస్థానంలో నిలిచింది.

IMDB Top 250 films
అగ్రస్థానంలో 'కాంతారా'.. కేజీయఫ్​, ఆర్​ఆర్​ఆర్​, బాహుబలి ఎంతంటే?

By

Published : Oct 18, 2022, 6:56 PM IST

'కాంతార.. సినీఇండస్ట్రీలో ఇప్పుడెక్కడ చూసిన ఈ పేరే వినిపిస్తోంది. ఎందుకంటే ఇటీవలే విడుదలైన ఈ చిత్రం ఇండియన్​ బాక్సాఫీస్​ ముందు సంచలనం సృష్టిస్తోంది. అధిక వసూళ్లతోపాటు విమర్శకుల ప్రశంసలూ అందుకుంటోంది. రిషబ్‌ శెట్టి స్వీయదర్శకత్వంలో నటించిన ఈ సినిమా.. తెలుగులోనూ విడుదలైంది.

అయితే తాజాగా ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్‌ పోర్టల్‌ ఐఎండీబీ ప్రకటించిన 'టాప్‌ 250 ఇండియన్‌ ఫిల్మ్స్‌' జాబితాలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. తమ యూజర్స్‌ ఇచ్చిన రేటింగ్స్‌ ఆధారంగా ఐఎండీబీ ఆ లిస్ట్‌ను రూపొందించింది. సోషల్‌ మీడియా వేదికగా ఆ వివరాలు పంచుకుంది.నంబర్‌ 1గా 'కాంతార' ఉండగా 2వ స్థానంలో రామాయణ (1993), 3లో రాకెట్రీ (2022), 4లో నాయకన్‌ (1987), 5లో అన్బే శివం (2003), 6లో గోల్‌మాల్‌ (1979), 7లో జై భీమ్‌, 8లో 777 చార్లీ, 9లో పరియెరుమ్‌ పెరుమాళ్‌ (2018), 10లో మణిచిత్రతజు (1993) నిలిచాయి. తెలుగు సినిమాల వివరాలివీ.. కేరాఫ్‌ కంచరపాలెం (17వ స్థానం), జెర్సీ (22), సీతారామం (39), మహానటి (44), ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ (48), బాహుబలి: ది కన్‌క్లూజన్‌ (101), బొమ్మరిల్లు (125), రంగస్థలం (129), అతడు (134), పెళ్లి చూపులు (146), ఎవరు (155), క్షణం (156), మేజర్‌ (165), వేదం (176), అర్జున్‌ రెడ్డి (179), బాహుబలి: ది బిగినింగ్‌ (182), ఆర్‌ఆర్‌ఆర్‌ (190), ఒక్కడు (209), పోకిరి (212), మనం (217), ఊపిరి (220), హ్యాపీడేస్‌ (236), గూఢచారి (244వ స్థానం).

అగ్రస్థానంలో 'కాంతారా'.. కేజీయఫ్​, ఆర్​ఆర్​ఆర్​, బాహుబలి ఎంతంటే?
అగ్రస్థానంలో 'కాంతారా'.. కేజీయఫ్​, ఆర్​ఆర్​ఆర్​, బాహుబలి ఎంతంటే?
అగ్రస్థానంలో 'కాంతారా'.. కేజీయఫ్​, ఆర్​ఆర్​ఆర్​, బాహుబలి ఎంతంటే?

ఇదీ చూడండి:సలార్ నుంచి​ సూపర్ అప్డేట్​.. 'కాంతార'ను మించేలా..

ABOUT THE AUTHOR

...view details