తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

ఆ సినిమాల కోసం ఫ్యాన్స్ తెగ వెయిటింగ్​ - ఐఎండీబీ లిస్ట్​లో టాప్​ మూవీస్​ ఇవే - ఐఎండీబీ సినిమాలు

IMDB Most Anticipated Movies 2024 : ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్‌ పోర్టల్‌ ఇంటర్నెట్‌ మూవీ డేటాబేస్‌ (ఐఎమ్‌డీబీ) తాజాగా 2024లో మూవీ లవర్స్​ ఎదురుచూస్తోన్న ఇండియన్‌ సినిమాల జాబితాను విడుదల చేసింది. ఇందులో టాలీవుడ్​కు చెందిన నాలుగు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు స్థానాన్ని దక్కించుకున్నాయి. ఆ విశేషాలు మీ కోసం

IMDB Most Anticipated Movies 2024
IMDB Most Anticipated Movies 2024

By ETV Bharat Telugu Team

Published : Jan 9, 2024, 7:15 PM IST

IMDB Most Anticipated Movies 2024 : ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్‌ పోర్టల్‌ ఇంటర్నెట్‌ మూవీ డేటాబేస్‌ (ఐఎమ్‌డీబీ) తాజాగా 2024లో మూవీ లవర్స్​ ఎదురుచూస్తోన్న ఇండియన్‌ సినిమాల జాబితాను విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ప్రతి నెలా ఈ వెబ్‌సైట్‌ను చూసే 20కోట్ల మంది యూజర్ల రియల్‌ పేజ్‌ వ్యూస్‌ ఆధారంగా ఈ లిస్ట్‌ను తయారు చేస్తుంది. ఈ నేపథ్యంలో సోషల్‌ మీడియా వేదికగా ఈ టాప్‌ 20 సినిమాలను పంచుకుంది. ఇందులో టాలీవుడ్‌కు చెందిన 5 సినిమాలు ఉండటం విశేషం.

బాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ సిద్ధార్థ్‌ ఆనంద్‌ రూపొందిస్తున్న 'ఫైటర్‌' తొలి స్థానంలో ఉండగా, అల్లు అర్జున్‌ అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తోన్న 'పుష్ప2' తర్వాతి స్థానంలో ఉంది. ఇక ప్రభాస్ 'కల్కి 2898 ఏడీ' సినిమా ఐదవ స్థానంలో అలాగే తేజ సజ్జా 'హనుమాన్‌' ఏడవ ప్లేస్​లో, 'దేవర'(10), 'గుంటూరు కారం' (12) స్థానాలను కైవసం చేసుకున్నాయి. మరోవైపు కోలీవుడ్ స్టార్ హీరో సూర్య బిగ్ ప్రాజెక్ట్ 'కంగువ' తొమ్మిదో స్థానంలో ఉండగా, లోకనాయకుడు కమల్‌హాసన్‌ శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న 'ఇండియన్‌ -2' 17లో ఉంది.

అయితే ఈ లిస్ట్​లో 'ఫైటర్‌' మూవీ టాప్​ పొజిషన్​లో ఉండటం పట్ల ఆ మూవీ హీరో హృతిక్‌ రోషన్​ ఆనందం వ్యక్తం చేశారు. "సినిమా రిలీజ్​కు మందు ఈ లిస్ట్‌ రావడం మాకు ఉత్సాహాన్నిచ్చింది. టీజర్‌, ట్రైలర్‌ ఎంతో ప్రేక్షకాదరణ పొందాయి. ఈ చిత్రాన్ని కూడా ఇదే స్థాయిలో ఆదరిస్తారని మేము ఆశిస్తున్నాం. జనవరి 25న థియేటర్లో మీ అందరినీ చూడటం కోసం ఎదురుచూస్తున్నాం" అని హీరో హృతిక్​ వెల్లడించారు.

Highest Rated Indian Film On IMDB :ఇటీవలే బాలీవుడ్​లో విడుదలై యావత్​ సినీ ఇండస్ట్రీలో మంచి టాక్ అందుకుని సెన్సేషన్​ క్రియేట్​ చేస్తున్న '12th ఫెయిల్‌' మూవీ తాజాగా ఓ అరుదైన ఘనత సాధించింది. ఇంటర్నెట్‌ మూవీ డేటాబేస్‌ (ఐఎమ్‌డీబీ)లో అత్యధిక రేటింగ్‌ పొందిన ఇండియన్‌ సినిమాగా ఇది రికార్డు నెలకొల్పింది.

ఐఎండీబీ మోస్ట్ పాపులర్ స్టార్స్​ - టాప్​లో ఆ సినిమా నుంచి ముగ్గురు స్టార్స్!​

మోస్ట్ పాపులర్ వెబ్ సిరీస్​గా 'రానా నాయుడు' - తర్వాతి స్థానాల్లో ఏవంటే ?

ABOUT THE AUTHOR

...view details