తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

Ilayaraja Biopic : ఇళయరాజా బయోపిక్.. ఛాన్స్ కొట్టేసిన ఆ స్టార్ హీరో! - ఇళయరాజా లేటెస్ట్​

Ilayaraja Biopic : కోయిల పాటను మించిన కమ్మని స్వరం ఇళయరాజా సొంతం. అందుకే ఆయన రాగాలకు కరగని మనసుండదు.. కదలని గుండె ఉండదు. ఇప్పుడు ఆయన గురించి ఆసక్తికరమైన వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. త్వరలోనే ఆయన బయోపిక్​ తెరకెక్కనుందట.

ilayaraja biopic
ilayaraja biopic

By

Published : Aug 3, 2023, 10:03 AM IST

Ilayaraja Biopic : ఇళయరాజా.. ఈ పేరు సంగీతానికి చిరునామా. ఆయనలో అద్భుత గాయకుడు, గీతరచయిత ఉన్నారు. ఇప్పటి వరకు 1400 చిత్రాలకు పైగా పనిచేసి ఇళయరాజా చరిత్ర సృష్టించారు. అలాంటిది ఈయన జీవిత చరిత్రను సినిమా తీస్తే?.. అవును మీరు విన్నది నిజమే. ఇప్పుడీ ఈ ఆలోచన బాలీవుడ్‌ ప్రముఖ దర్శకుడికి వచ్చింది.

ఇళయరాజాగా ఆ స్టార్​ హీరో?
బాలీవుడ్​లో అనేక చిత్రాలు తీసి ప్రేక్షకులను అలరిస్తున్న డైరెక్టర్ బాల్కీ.. ఇళయారాజా బయోపిక్​ తీయాలనుకుంటున్నారట. ఇదే విషయాన్ని ఇటీవలే జరిగిన ఓ మీటింగ్​లో చెప్పారట. అది తన డ్రీమ్​ అని.. ఇళయరాజాగా ధనుష్​ను చూడాలనుకుంటున్నట్లు తెలిపారట. అయితే ధనుష్‌ కూడా మంచి సింగర్, లిరిక్ రైటర్, డైరెక్టర్, నిర్మాత అన్న విషయం తెలిసిందే.

ధనుష్​ రెడీ!
అయితే ఇళయరాజాగా నటించేందుకు ధనుష్ కూడా ఆసక్తితో ఉన్నట్లు సమాచారం. ఈ విషయమై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. డైరెక్టర్​ బాల్కీ.. ఇప్పటికే హీరో ధనుష్‌తో 'షమితాబ్‌' సినిమా తీశారు. ఇందులో బిగ్‌బీ అమితాబ్‌ కూడా నటించారు. అలానే బాల్కీతో నటుడు ధనుష్‌కు మంచి ఫ్రెండ్‌షిప్‌ ఉంది. ఈ క్రమంలోనే సంగీత దర్శకుడు ఇళయరాజాగా ధనుష్‌ని చూడాలని బాల్కీ ఆశపడుతున్నారు.

కాగా.. ఇప్పటికే పలువురి నటీనటుల జీవిత చరిత్రలు తెరకెక్కాయి. నటసౌర్వభౌమ నందమూరి తారక రామారావు​.. బయోపిక్​లో ఆయన కుమారుడు స్టార్​ హీరో బాలకృష్ణ నటించారు. రెండు భాగాలుగా విడుదలైన సీనియర్​ ఎన్టీఆర్​ బయోపిక్​ బాక్సాఫీస్​ వద్ద విజయం సాధించింది. దాంతోపాటు అలనాటి నటి మహానటి సావిత్రి బయోపిక్​లో కీర్తిసురేశ్ నటించి అదరగొట్టారు. జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ సినిమా ప్రేక్షకులు ఎంతో దగ్గరవడంతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలను కూడా అందుకున్నారు. రాజకీయంగా, నటన పరంగా అందరినీ ఆకట్టుకుని తనకంటూ ఒక స్టార్​డమ్​ను సాధించుకున్నారు జయలలిత. ఈమె బయోపిక్​ 'తలైవి'లో కంగనా రనౌత్ నటించారు. ఈ సినిమాకు కూడా ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. ఇలా ఎంతో మంది తారల బయోపిక్​లో వెండితరపై మెరిసి విజయాల్ని సాధించాయి.

ABOUT THE AUTHOR

...view details