తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

రష్యా భాషలో 'పుష్ప' ట్రైలర్​ చూశారా.. తగ్గేదే లే - pushpa mania in russia

ఇప్పటికే బాహుబలి ఆర్​ఆర్​ఆర్​ సినిమాలు అంతర్జాతీయ స్థాయిలో విడుదలై సత్తా చాటిన సంగతి తెలిసిందే. ఇప్పుడు పుష్ప వంతు వచ్చింది. డిసెంబరు 8న రష్యాలో విడుదలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో రష్యా భాషలో ట్రైలర్​ను రిలీజ్ చేసింది మూవీటీమ్​. దాన్ని మీరు చూసేయండి..

puspha russian trailer
రష్యా భాషలో 'పుష్ప' ట్రైలర్​ చూశారా

By

Published : Nov 29, 2022, 12:16 PM IST

టాలీవుడ్​ చిత్రాలు అంతర్జాతీయ స్థాయిలో అదరగొడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్‌ పలు దేశాల్లో బ్లాక్‌బాస్టర్‌గా నిలవగా.. ఇప్పుడు పుష్ప వంతు వచ్చింది. స్టైలిష్‌ స్టార్‌ అల్లుఅర్జున్‌ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పటికే పలు భాషల్లో ప్రేక్షకులను అలరించింది. తాజాగా ఈ సినిమా రష్యాలో సంచలనం సృష్టించేందుకు సిద్ధమైంది. డిసెంబర్‌ 8న చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో రష్యా భాషల్లో ట్రైలర్​ విడుదల చేసింది మూవీ టీమ్​. ఇది ఆసక్తికరంగా అభిమానులను ఆకట్టుకుంటోంది. కాగా, డిసెంబర్‌ 1న మాస్కోలో, డిసెంబర్‌ 3న సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌లో మూవీ టీం అభిమానులతో ముచ్చటించనుంది. దీని కోసం పుష్ప బృందం రష్యా చేరుకోనుంది.

ఇక 'పుష్ప 2' సినిమా షూటింగ్‌ ప్రారంభమైంది. దీనిపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాల్ని దృష్టిలో పెట్టుకుని రెండో భాగాన్ని అత్యున్నత సాంకేతిక హంగులతో ముస్తాబు చేస్తోంది చిత్రబృందం. రామోజీ ఫిల్మ్‌ సిటీలో వేసిన ప్రత్యేకమైన సెట్లో కొన్ని సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. సుకుమార్‌ తెరకెక్కిస్తున్న ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది.

ఇదీ చూడండి:ఆహా 'డ్యాన్స్​ ఐకాన్'​ విన్నర్​గా అసిఫ్​, రాజు.. ప్రైజ్​మనీ ఎంతంటే?

ABOUT THE AUTHOR

...view details