తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

ఆ దేశంలో పుష్ప మేనియా షురూ.. మేకర్స్​ కీలక నిర్ణయం - pushpa mania in russia

ఇప్పటికే బాహుబలి ఆర్​ఆర్​ఆర్​ సినిమాలు అంతర్జాతీయ స్థాయిలో విడుదలై సత్తా చాటిన సంగతి తెలిసిందే. ఇప్పుడు పుష్ప వంతు వచ్చింది. రష్యాలో విడుదలకు సిద్ధమైంది. రిలీజ్ డేట్ ఎప్పుడంటే?

Pushpa russia release date
ఆ దేశంలో పుష్ప మేనియా.. మేకర్స్​ కీలక నిర్ణయం

By

Published : Nov 28, 2022, 4:49 PM IST

టాలీవుడ్​ చిత్రాలు అంతర్జాతీయ స్థాయిలో అదరగొడుతున్నాయి. ఇప్పటికే బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్‌ పలు దేశాల్లో బ్లాక్‌బాస్టర్‌గా నిలవగా.. ఇప్పుడు పుష్ప వంతు వచ్చింది. స్టైలిష్‌ స్టార్‌ అల్లుఅర్జున్‌ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పటికే పలు భాషల్లో ప్రేక్షకులను అలరించింది. తాజాగా ఈ సినిమా రష్యాలో సంచలనం సృష్టించేందుకు సిద్ధమైంది. మాస్కో ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ఈ సినిమాను రష్యన్‌ సబ్‌టైటిల్స్‌తో ప్రదర్శించిన సంగతి తెలిసిందే. అప్పుడే ఈ సినిమాను రష్యన్‌ డబ్బింగ్‌ వర్షన్‌ను విడుదలచేయనున్నట్లు ప్రకటించిన చిత్రబృందం తాజాగా తేదీను వెల్లడించింది. డిసెంబర్‌ 8న విడుదల చేయనున్నట్లు పేర్కొంది. డిసెంబర్‌ 1న మాస్కోలో, డిసెంబర్‌ 3న సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌లో మూవీ టీం అభిమానులతో ముచ్చటించనుంది. దీని కోసం పుష్ప బృందం రష్యా చేరుకోనుంది.

ఇక 'పుష్ప 2' సినిమా షూటింగ్‌ ప్రారంభమైంది. దీనిపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాల్ని దృష్టిలో పెట్టుకుని రెండో భాగాన్ని అత్యున్నత సాంకేతిక హంగులతో ముస్తాబు చేస్తోంది చిత్రబృందం. రామోజీ ఫిల్మ్‌ సిటీలో వేసిన ప్రత్యేకమైన సెట్లో కొన్ని సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. సుకుమార్‌ తెరకెక్కిస్తున్న ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది.

ఇదీ చూడండి:ఆహా 'డ్యాన్స్​ ఐకాన్'​ విన్నర్​గా అసిఫ్​, రాజు.. ప్రైజ్​మనీ ఎంతంటే?

ABOUT THE AUTHOR

...view details