Allu Arjun Gift To Klin kaara : మెగా ఇంటి బల్లి వారసురాలు ప్రిన్సెస్ క్లీంకార కొణిదెల రాకతో ఆ ఇంట ఆనందాలు వెల్లి విరిశాయి. పుట్టినప్పటి నుంచే తను పేరు మార్మోగిపోయింది. గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్- ఉపాసన దంపతులకు వివాహం అయిన 11 ఏళ్ల తర్వాత బిడ్డ జన్మనివ్వడం వల్ల ఇటు మెగా ఫ్యామిలీతో పాటు అటు కామినేని ఇంట సంబరాలు అంబరాన్నింటాయి. ఇక చరణ్- ఉపాసనల ఆనందానికైతే అవధుల్లేకుండా పోయింది. ఇటీవలే క్లీంకార బారసాల వేడుక కూడా అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా వేడుకకు హాజరైన అతిథులు చెర్రీ- ఉప్సీ గారాలపట్టికి ఎన్నో విలువైన బహుమతులను అందించారు. ఇంకొన్ని బహుమతులు ఇప్పటికీ వస్తూనే ఉన్నాయి.
Jr NTR Gift To Klin Kaara : ఈ క్రమంలో అప్పట్లోరామ్చరణ్ బెస్ట్ ఫ్రెండ్, టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ చిన్నారితో పాటు చెర్రీ ఉప్సీల కోసం.. బంగారు కాయిన్లను స్పెషల్ డిజైన్ చేయించి.. బహుమతులుగా పంపినట్లు వార్తలు వచ్చాయి. ఇక తాజాగా అల్లు అర్జున్ క్లీంకారకు ఓ విలువైన కానుకను అందించినట్లు సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. బన్నీ బంగారు పలకు బహుమతిగా ఇచ్చారట. ఇప్పుడే పలకేంటి అనుకుంటున్నారేమో? పలక అంటే రాసుకునేది కాదు.. క్లీంకార పేరు, ఆమె పుట్టిన వివరాలు వచ్చేలా పలకపై బంగారు అక్షరాలు వచ్చేలా డిజైన్ చేయించారట! ఈ విషయం తెలుసుకున్న బన్నీ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఐకాన్ స్టార్ ఐడియా కొత్తగా ఉందని మురిసిపోతున్నారు.
ఇక పాప పుట్టకముందు నుంచే మెగా ఇంటికి కానుకల వెల్లువ మొదలైంది. ఉపాసన సోషల్ మీడియాలో తమ చిన్నారి కోసం చేయించిన ఓ ఊయల గురించి ఆసక్తికరమైన విషయాన్ని షేర్ చేశారు. తమకు పుట్టబోయే బిడ్డ కోసం ప్రజ్వలా ఫౌండేషన్ ఓ ప్రత్యేకమైన ఊయలను కానుకగా ఇచ్చారంటూ చెప్పుకొచ్చారు. ఊయల ప్రాముఖ్యతతో పాటు దాన్ని తయారుచేసిన విధానాన్ని వివరించారు.సెక్స్ ట్రాఫికింగ్‌లో చిక్కుకుని బయటపడిన మహిళలకు.. ప్రజ్వల ఫౌండేషన్ ఉపాధితో పాటు ఆశ్రయం కల్పిస్తోందని.. వారిలోని కొందరు మహిళలే ఈ ఊయలను తయారు చేశారని ఉపాసన తెలిపారు.
Kalabhairava Special Tune For Mega Princess : మరోవైపు ఉపాసన, రామ్ చరణ్ దంపతుల బిడ్డ కోసం టాలీవుడ్ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్, కాల భైరవ ఓ అద్భుతమైన ట్యూన్‌ను గిఫ్ట్‌గా అందించారు. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిన రామ్ చరణ్ దంపతులు.. ఈ ట్యూన్ విని చిన్నారులు ఆనందంలో మునిగిపోయేలా ఉన్నారంటూ కాల భైరవకు కితాబులిచ్చారు.
Ram Charan Baby Name : చరణ్- ఉపాసన దంపతులకు జూన్ 20న మెగా ప్రిన్సెస్ క్లీంకార జన్మించింది. జూన్ 30న ఆమె బారసాల ఎంతో గ్రాండ్‌గా జరిగింది. అందులో పాపాయికి క్లీంకార అని నామకరణం చేశారు. ఈ పేరును లలిత సహస్రనామం నుంచి తీసుకున్నట్లు కుటుంబసభ్యులు వెల్లడించారు. 'క్లీంకార' అనే పదం ప్రకృతి స్వరూపాన్ని, మాతాశక్తిలో నిక్షిప్తమైన అనుగ్రహాన్ని సూచిస్తుందని.. ఆ పేరుకి శక్తివంతమైన వైబ్రేషన్ ఉందని మెగాస్టార్ చిరంజీవి స్వయంగా చెప్పుకొచ్చారు.