సమంత 'శాకుంతలం' ట్రైలర్ లాంచ్ కార్యక్రమం సోమవారం గ్రాండ్‌గా జరిగింది. చాలా కాలం తర్వాత సామ్‌ను చూసిన ఫ్యాన్స్ ఎంతో ఆనందించారు. ప్రస్తుతం సమంత ఫొటోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. అయితే సమంతపై సామాజిక మాధ్యమాల్లో ఓ పేజీ పెట్టిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట తీవ్ర దుమారం రేపుతోంది.
ట్విట్టర్‌కు చెందిన బజ్ బాస్కెట్ అనే ఓ పేజీ సమంత ఫొటోలతో ఓ క్యాఫ్షన్ ఇమేజ్ను షేర్ చేసింది. "సమంతను చుస్తుంటే బాధనిపిస్తోంది. ఆమె తన అందాన్ని కోల్పోయింది. విడాకుల నుంచి బయటపడ్డ ఆమె సినీ కెరీర్లో టాప్‌లో ఉన్న టైమ్‌లో మయోసైటిస్ వ్యాధి వల్ల ఆమె మరింత బలహీనురాలయ్యింది" అని ఆ పోస్టులో రాసుకొచ్చారు.
'నాలా మీరెప్పుడు బాధపడకూదడని ప్రార్థిస్తున్నా'.. ట్రోల్స్‌కు సమంత స్ట్రాంగ్ కౌంటర్ - సమంత శాకుంతలం సినిమా
గత కొంత కాలంగా మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్న సమంత ప్రస్తుతం దాని కోసం చికిత్స తీసుకుంటున్నారు. తాజాగా శాకుంతలం ట్రైలర్ లాంచ్‌లో సామ్‌ను చూసిన నెటిజన్లు సామాజిక మాధ్యమాల్లో తన ఫొటోలను షేర్ చేస్తున్నారు. ఈ క్రమంలో ట్విట్టర్లో వచ్చిన ఓ ట్వీట్ ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది.
ఈ పోస్ట్ చూసిన సామ్ ఫ్యాన్స్ ఆ పేజీపై దుమ్మెత్తి పోస్తున్నారు. ఈ పోస్టు సామ్ కంట కూడా పడింది. దీనికి ఆమె దీటుగా రిప్లై ఇచ్చారు. "నేను తీసుకున్న విధంగా మీరు నెలల తరబడి చికిత్స తీసుకోకూడదని దేవుడ్ని ప్రార్థిస్తున్నాను" అని ట్వీట్ చేశారు. ఈ పోస్ట్‌ను చూసిన ఫ్యాన్స్ సైతం సామ్‌కు సపోర్ట్ చేస్తూ మరిన్ని ట్వీట్స్ చేశారు.
అయితే యశోద మూవీ టైంలో 'మయోసిటిస్' అనే ఆటో ఇమ్యూన్ వ్యాధితో బాధపడుతున్నట్లు సమంత ఓ ఇన్‌స్టా పోస్ట్ ద్వారా తెలిపారు. ట్రీట్మెంట్ తీసుకుంటూనే మూవీకి డబ్బంగ్ చెప్పిన సామ్.. మళ్లీ చాలా కాలం తర్వాత మీడియా ముందుకు వచ్చారు.