తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'నటిగా నాకు కొన్ని పరిమితులున్నాయి.. నేను చాలా స్ట్రాంగ్' - దొంగలున్నారు జాగ్రత్త విడుదల తేది

'దొంగలున్నారు జాగ్రత్త' లాంటి సినిమా ఇప్పటివరకు తెలుగులో రాలేదంటోంది యువ నటి ప్రీతి అస్రాని. ఈ సినిమాలో శ్రీ సింహ కోడూరి.. ప్రీతి జంటగా నటించారు. ఈ నెల 23న చిత్రం విడుదల నేపథ్యంలో ప్రీతి విలేకర్లతో ముచ్చటించారు.

preethi asrani
i have certain limits says preethi asrani about dongalunnaru jagratha movie

By

Published : Sep 20, 2022, 6:49 AM IST

Dongalunnaru Jagratha Movie : "ఓ వినూత్నమైన కథాంశంతో రూపొందిన చిత్రం 'దొంగలున్నారు జాగ్రత్త'. ఇలాంటి సినిమా తెలుగులో ఇప్పటి వరకు రాలేదు. కథ ఎంత వినూత్నంగా ఉంటుందో.. దాన్ని తెరకెక్కించిన తీరూ అంతే కొత్తగా ఉంటుంది" అంది నటి ప్రీతి అస్రాని. ఆమె.. శ్రీ సింహ కోడూరి జంటగా నటించిన ఈ చిత్రాన్ని సతీష్‌ త్రిపుర తెరకెక్కించారు. డి.సురేష్‌బాబు, సునీత తాటి సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా ఈనెల 23న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే సోమవారం హైదరాబాద్‌లో విలేకర్లతో చిత్ర విశేషాలు పంచుకుంది నాయిక ప్రీతి.

  • "నేనిందులో నీరజ అనే పాత్ర పోషించా. నా పాత్ర కథలో చాలా కీలకంగా ఉంటుంది. ప్రతి మహిళకు ఆ పాత్ర నచ్చుతుంది. ఎందుకంటే ఇందులో మధ్యతరగతి కుటుంబంలో జరిగే ఎన్నో విషయాలు ఉంటాయి. అలాగే సినిమాలో మీరు ఊహించని మలుపులుంటాయి. అవి ఆద్యంతం ఆసక్తిరేకెత్తిస్తాయి".
  • "నీరజ ప్రపంచానికి నాకు ఒక పోలిక ఉంది. మేమిద్దరం చాలా స్ట్రాంగ్‌. నీరజ ఎలాంటి పరిస్థితినైనా ధైర్యంగా ఎదుర్కొంటుంది. నాలో కూడా ఆ గుణం ఉంది. అలాగే ఆ పాత్రలో ఉన్నట్లే నాలోనూ కాస్త మొండితనం ఎక్కువే. ఈ చిత్ర బృందంతో కలిసి పనిచేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నా. దర్శకుడు సతీష్‌కు మంచి విజన్‌ ఉంది. సముద్రఖని, శ్రీకాంత్‌ అయ్యంగార్‌ వంటి అద్భుతమైన నటులతో పనిచేసే అవకాశం రావడం గొప్ప అనుభవం".
  • "ఓ నటిగా నాకంటూ కొన్ని పరిమితులున్నాయి. ఓ పాత్ర ఎంచుకునేటప్పుడు వాటిని నేను దాటలేను. ఇప్పటివరకు నేను చేసిన పాత్రలన్నీ డీసెంట్‌గా, ఫ్యామిలీ ఓరియంటెడ్‌గా ఉన్నాయి. ఇలాంటి పాత్రలే నాకు బాగా నప్పుతాయి. నటనకు ఆస్కారమున్న.. అర్థవంతమైన పాత్రలు చేయాలన్నదే నా లక్ష్యం. అవకాశమొస్తే నాయికా ప్రాధాన్య చిత్రాల్లోనూ నటించాలనుంది".
  • "మాది గుజరాత్‌. ఐదేళ్ల క్రితం హైదరాబాద్‌కు వచ్చాను. ఆ తర్వాత తెలుగు నేర్చుకున్నాను. నటి అంజు అస్రాని మా అక్క.. ఆమె స్ఫూర్తితోనే నటన వైపు అడుగులేశాను. నేను వినే కథలన్నీ అక్కతో చర్చిస్తాను. ప్రస్తుతం నేను తెలుగులో సమంత 'యశోద' చిత్రంలో అతిథి పాత్రలో కనిపిస్తా. రెండు కొత్త ప్రాజెక్ట్‌లు చేస్తున్నా. ఇందులో అన్నపూర్ణ బ్యానర్‌ వారి ఓ వెబ్‌సిరీస్‌ ఉంది. తమిళంలోనూ రెండు సినిమాలు చేస్తున్నా".

ABOUT THE AUTHOR

...view details