Hyper adi comments on pawankalyan: పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ అంటే జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆదికి ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే పలు సందర్భాల్లో పవన్‌పై తనకు ఉన్న ఇష్టాన్ని చెప్పిన అతడు.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని మరోసారి పవర్‌స్టార్‌పై తన అభిమానాన్ని చాటుకున్నాడు. తాను ఎప్పటికీ అభిమానిస్తూనే ఉంటానని చెప్పాడు.
పవన్‌కల్యాణ్‌పై హైపర్ ఆది కామెంట్స్ వైరల్.. ఏమన్నాడంటే?
Hyper adi comments on pawankalyan: పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్‌పై కమెడియన్ హైపర్ఆది కామెంట్స్ చేశాడు. అవి వైరల్‌గా మారాయి. ఏమన్నాడంటే...
"పవన్ అంటే ఎందుకు మీకంత ఇష్టం?" అని అడిగిన ప్రశ్నకు అతడు స్పందిస్తూ.. "పవన్‌కల్యాణ్ అంటే నాకు అమితమైన ఇష్టం. ఆయన మంచి మనిషి. క్రిష్ దర్శకత్వంలో పవన్‌కల్యాణ్ చేస్తోన్న 'హరిహర వీరమల్లు' కోసం నేను చిన్నవర్క్ చేస్తున్నా. అందులో భాగంగా ఇటీవల ఓ నాలుగు రోజులు ఇంటికి వెళ్లి పర్సనల్‌గా పవన్‌ను కలిశా. ఆయనెంత గొప్ప మనిషో అప్పుడు మరింత అర్థమైంది. ఇప్పుడున్న రోజుల్లో ఎలాంటి వ్యక్తినైనా డబ్బు మార్చేస్తోందనే విషయం మనకు తెలుసు. ఆయనకు మాత్రం డబ్బు అంటే అస్సలు ఆసక్తి లేదు. అలాంటి వ్యక్తి కచ్చితంగా ఎదుటివారికి మంచి చేయాలనే ఆలోచిస్తాడు. సినిమాల నుంచి వచ్చిన సొమ్ముని కౌలు రైతులకు సాయం చేసేందుకు ఉపయోగిస్తున్నారు. ఒక సినిమా చేస్తే సుమారు రూ.50 కోట్లు వస్తే ఆ మొత్తాన్ని పేదలకు సాయం చేయడానికి, పార్టీ కార్యకలాపాలకు, పార్టీ కోసం పనిచేస్తోన్న వారికి పంచేస్తారు. ఆయన వ్యక్తిత్వం అలాంటిది. అందరి మంచి కోరుకునే వ్యక్తికి మంచి జరిగితే మనం ఎంతో సంతోషిస్తాం కదా. ఆయనపై నా భావన కూడా అదే" అని ఆది పేర్కొన్నాడు. అనంతరం "వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారా" అని ప్రశ్నించగా.. అలాంటిది ఏమీ లేదు అని తెలిపాడు.
ఇదీ చూడండి: స్టార్ హీరో బిగ్‌డీల్.. రూ.119కోట్లు పెట్టి లగ్జరీ ఇల్లు కొనుగోలు!