Bhola shankar pre release event : మెగాస్టార్ చిరంజీవి భోళాశంకర్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కమెడియన్ హైపర్ ఆది మాట్లాడిన కామెంట్స్ సోషల్ మీడియాలో పుల్ వైరల్ అవుతున్నాయి.
Hyper aadi comments Bhola shankar pre release event : హైపర్ ఆది మాట్లాడుతూ... "ఒక సాధారణ మధ్య తరగతి కుటుంబానికి చెందిన ఒక యువకుడు నేను సైనికుడిని అవుతా అని చెప్పి యుద్ధ భూమికి బయలుదేరాడు. ఆ యుద్ధ భూమిలో కండలు తిరిగిన సైనికులు చాలా మంది ఉన్నారు. వాళ్లు యుద్ధం చేస్తున్నారు. గెలుస్తున్నారు. అది ఆయన చూస్తున్నాడు. ఒక రోజు ఈయనకు యుద్ధం చేసే అవకాశం వచ్చింది. గెలిచాడు. అందరూ కలిసి అతడిని సైన్యాధిపతిగా ఎంచుకున్నాడు. దీంతో అతడు ఒక ముప్పై ఏళ్లు యుద్ధభూమిని ఏలాడు. ఆయన ఎవరో కాదు... మెగాస్టార్ చిరంజీవి. అన్నయ్య ఇంత మంది సినీ సైనికులను తయారు చేసి... ఇంద్రాసేనాని అయితే... తమ్ముడేమో.. జనసైనికుల్ని తయారు చేసి జనసేనాని అయ్యారు. బేసిక్‌గా హీరోలకు ఫ్యాన్స్ ఉంటారు.. కానీ ఆయనకు హీరోలే ఫ్యాన్స్ గా ఉంటారు. ఆస్తులు సంపాదించడం కన్నా... అభిమానులను సంపాదించారు. అటు కొత్త తరం వారికి పాత తరం వారికి మధ్యలో వారధి. ప్రతి ఇంట్లో ఫ్యాన్ ఉంటదో లేదో చెప్పలేం కానీ... ప్రతి ఇంట్లో మెగాస్టార్ ఫ్యాన్ అయితే కచ్చితంగా ఉంటారు" అని అన్నారు.
Hyper aadi comments on chiranjeevi : సచిన్-చిరంజీవి ఒక్కటే.. నా దృష్టిలో మెగాస్టార్ చిరంజీవి, సచిన్ తెందుల్కర్ ఒకటే. సచిన్ తెందుల్కర్ ఎవరైనా విమర్శిస్తే.. బ్యాట్ తో సమాధానం చెబుతారు. అలాగే మెగాస్టార్ చిరంజీవిని ఎవరినైనా విమర్శిస్తే.. ఆయన సినిమాతో సమాధానం చెబుతారు అని హైపర్ ఆది చెప్పారు. ఆచార్య సినిమాతో విమర్శలు వచ్చాయి.. వాల్తేరు వీరయ్యతో సమాధానం చెప్పారు. డ్యాన్స్, ఫైట్స్‌లో మార్క్ సెట్ చేసింది మెగాస్టార్ చిరంజీవినే. అప్పట్లో మొదటి సారి కోటి రూపాయలకు పైగా ఇండియన్ యాక్టర్ ఎవరంటే.. మెగాస్టార్ చిరంజీవి. మొదటి రూ. 10 కోట్లు కలెక్ట్ చేసిన చిత్రం ఘరానా మొగుడు అని ఎక్కడ వెతికినా వస్తది. ఇక్కడ ఉన్న చాలా మందికి ఊహ తెలియక ముందే ఎన్నో రికార్డ్స్ క్రియేట్ చేశారు. ఆయన ఎదగక ముందు అవమానాలు జరిగాయి. ఎదిగిన తర్వాత కూడా అవమానాలు ఎదురయ్యాయి. ఆయన ఎప్పుడూ ఎవ్వరినీ ఏం అనలేదు. ఠాగూర్ సినిమాలో ఆయనకు నచ్చని ఓకే ఒక్క పదం క్షమించడం.. కానీ ఆయన నిజ జీవితంలో ఆయనకు నచ్చిన పదం క్షమించడం అని హైపర్ ఆది అన్నారు.
Hyper aadi comments viral : గుండు కొట్టేసేవారు.. ఒకప్పుడు చిరు రాజకీయ ప్రచారం చేసే సమయంలో ఎవరో గుడ్డు కొట్టాడు. ఒక్కసారి ఆయన కన్నేర్ర చేసి ఉంటే.. అక్కడే వాడికి గుండు కొట్టేవారు. ఒకప్పుడు మినిస్టర్ హోదాలో ఆయన ఓటు హక్కు గురించి లైన్ క్రాస్ చేస్తే... ఓ ఎన్ఆర్ఐ లిమిట్స్ క్రాస్ చేసి మాట్లాడాడు. చూసిన మనకందరికీ కోపం వచ్చింది. చిరంజీవికి కోపం రాలేదు. కొన్ని వేల మందికి ప్రవచనాలు చెప్పే ఓ వ్యక్తి.. కొన్ని కోట్ల మంది అభిమానించే మెగాస్టార్ చిరంజీవి మీద అసహనం వ్యక్తం చేశారు. అది కూడా చిరంజీవికి సంబంధం లేకుండా. ఆరోజూ కూడా చిరంజీవి సహనం కోల్పోలేదు. ఆ రోజు వెళ్లి ఆయన పక్కకు వెళ్లి కూర్చున్నారు. అని హైపర్ ఆది అన్నారు.