తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

Naga chaitanya car: నాగ చైతన్య వాహనానికి జరిమానా.. ఎందుకంటే!

Naga chaitanya car: హైదరాబాద్ జూబ్లీహిల్స్, గచ్చిబౌలి వరుస ప్రమాదాల అనంతరం నగర పోలీసులు అప్రమత్తమయ్యారు. కారు అద్దాలకు బ్లాక్ ఫిలిం, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ స్టిక్కర్లతో తిరుగుతున్న వాహనాలపై దృష్టి పెట్టారు. బ్లాక్ ఫిలిం ఉన్న కార్లను నిలిపివేసి అక్కడికక్కడే తొలగిస్తున్నారు. ఇలా హైదరాబాద్ జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు వద్ద తనిఖీల్లో నాగ చైతన్య కారుకు బ్లాక్‌ ఫిల్మ్‌ ఉందని గుర్తించిన పోలీసులు... నలుపు తెరను తొలగించారు.

Naga chaitanya
నాగచైతన్య

By

Published : Apr 12, 2022, 7:51 AM IST

Updated : Apr 12, 2022, 8:18 AM IST

Naga chaitanya car: నటుడు నాగ చైతన్య కారుకు పోలీసులు రూ.900 చలానా విధించారు. జూబ్లీహిల్స్​ చెక్‌పోస్టు వద్ద పోలీసుల తనిఖీల్లో నాగ చైతన్య కారుకు బ్లాక్‌ ఫిలిం ఉండటంతో పాటు, నంబర్​ ప్లేటు సరిగా లేనట్లు గుర్తించారు. కారు అద్దాల బ్లాక్ ఫిలిం తొలగించిన ట్రాఫిక్‌ పోలీసులు.. జరిమానా వేశారు. తనిఖీల్లో మొత్తం 60 కేసులు నమోదు చేసినట్లు ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ ముత్తు తెలిపారు. ఇటీవల రోడ్డు ప్రమాదాలు అధికంగా జరుగుతుండగా.. ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహిస్తున్నారు.

బ్లాక్‌ ఫిల్మ్‌లు ఇతర నిబంధనలు అతిక్రమిస్తున్నవారిని గుర్తించి వాహనాలకు జరిమానా విధిస్తున్నారు. సెలెబ్రెటీలు నిబంధనలు పాటించకపోవడం చర్చనీయాంశమవుతోంది. ఇటీవల మనోజ్, జూనియర్ ఎన్టీఆర్, బన్నీ కార్లకు బ్లాక్​ ఫిలిం తొలగించి.. జరిమానా విధించారు.

ఇవీ చదవండి:

Last Updated : Apr 12, 2022, 8:18 AM IST

ABOUT THE AUTHOR

...view details