హృతిక్ రోషన్, సైఫ్ అలీఖాన్ కలిసి నటించిన యాక్షన్ థ్రిల్లర్ 'విక్రమ్ వేద'. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా గురించి ఓ వార్త ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేయడానికి చిత్రబృదం సిద్ధమైంది. ఏకంగా 100 దేశాల్లో విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. ఉత్తర అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్ లాంటి 22 యూరప్ దేశాలతోపాటు ఆఫ్రికాలోని 27 దేశాల్లోనూ విడుదల కానుంది. వీటిలో బాలీవుడ్‌కు అంతగా పట్టులేని జపాన్, రష్యా, పెరూ ఉన్నాయి.
హాట్‌టాపిక్‌గా 'విక్రమ్ వేద'.. ఏకంగా 100 దేశాల్లో.. - వంద దేశాల్లో విక్రమ్ వేదా
హృతిక్ రోషన్, సైఫ్ అలీఖాన్ కలిసి నటించిన యాక్షన్ థ్రిల్లర్ 'విక్రమ్ వేద' రిలీజ్ కాకాముందే హాట్‌టాపిక్‌గా మారింది. ఎందుకంటే ఈ చిత్రాన్ని ఏకంగా 100 దేశాల్లో విడుదల చేయనున్నట్లు మూవీటీమ్ వెల్లడించింది
ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న ఈ చిత్రం గురించి రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ ఓవర్సీస్ బిజినెస్ అధినేత ధ్రువ సిన్హా మాట్లాడుతూ.."విక్రమ్ వేద సినిమాను అందరూ ఆదరిస్తారు. ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకుంటుంది." అని ఆశాభావం వ్యక్తం చేశారు. తమిళంలో విజయవంతమైన 'విక్రమ్ వేద' చిత్రాన్ని హిందీలోనూ అదే పేరుతో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. పుష్కర్ గాయత్రి దర్శకత్వం వహించిన ఈ సినిమా సెప్టెంబర్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇదీ చూడండి: రణ్వీర్ న్యూడ్ ఫొటోషూట్ కేసులో ట్విస్ట్.. ఆ ఫొటోను మార్ఫింగ్ చేశారట!