How To Cancel Bookmyshow Tickets : ఒకప్పుడు సినిమా చూడాలంటే.. థియేటర్‌కు వెళ్లి క్యూలైన్లో నిల్చోని.. టికెట్లు సంపాదించేవారు. మారుతున్న కాలానికి అనుగుణంగా టికెట్ల కొనుగోలు విషయంలోనూ మార్పులు వచ్చేశాయి. థియేటర్‌కు వెళ్లకుండా.. ఫోన్లోనే టికెట్లను బుక్ చేస్తున్నారు. థియేటర్లో టికెట్ కొంటే.. ఇచ్చిన సీట్లలోనే కూర్చోవాలి. అదే ఆన్లైన్లో బుక్ చేసుకుంటే.. మనకు ఎక్కడ కావాలంటే అక్కడ కూర్చోవచ్చు. అయితే.. కొన్ని కారణాల వల్ల సినిమా టికెట్లను క్యాన్సిల్ చేసుకోవాల్సి వస్తుంది. మరి డబ్బుల పరిస్థితి ఏంటి..? ఈ విషయంలో కొందరు టెన్షన్ పడుతుంటారు. ఈజీగా టికెట్ క్యాన్సిల్ చేసుకోవచ్చు. డబ్బులు కూడా రిటర్న్ తీసుకోవచ్చు. మరి ఆ ప్రాసెస్ ఏంటీ?.. అన్నది చూద్దాం.
BookMyShowలో టిక్కెట్‌ను ఎలా రద్దు చేయాలి?
How to Cancel Ticket in BookMyShow:
- మీ పోన్లో BookMyShow App ఓపెన్ చేయాలి.
- ఒకవేళ యాప్ నుంచి లాగ్ అవుట్ అయితే లాగిన్ అయ్యి యాప్ ఓపెన్ చేయండి.
- Profile Icon మీద క్లిక్ చేయండి.
- Your Orders ఆప్షన్ మీద క్లిక్ చేయండి.
- అప్పుడు స్క్రీన్ మీద మీరు బుక్ చేసిన టికెట్స్ లిస్ట్ ఓపెన్ అవుతుంది.
- అందులో మీరు సినిమా చూడటానికి బుక్ చేసుకున్న టికెట్‌ను ఎంచుకోవాలి.
- ఆ తర్వాత Cancel Booking Option పై క్లిక్ చేయాలి.
- స్క్రీన్‌ను కిందకు స్క్రోల్ చేసి Refund Payment methodని ఎంచుకోవాలి.
- అనంతరం.. Get refund Buttonపై క్లిక్ చేయాలి.
ఇది మీ మొబైల్ అప్లికేషన్‌లో BookMyShowలో టిక్కెట్‌ను రద్దు చేయడానికి పూర్తి ప్రక్రియ.
అధికారిక వెబ్‌సైట్ నుంచి టికెట్ రద్దు చేసుకోవడం ఎలా..?
How to Cancel ticket on BookMyShow Official Website.. చాలా మంది ఇప్పటికీ BookMyShow మొబైల్ యాప్‌లను ఉపయోగించడం లేదు. వారు మూవీ టిక్కెట్‌లను బుక్ చేయడానికి BookMyShow అధికారిక వెబ్‌సైట్‌ను ఉపయోగిస్తున్నారు. మీరు కూడా అధికారిక వెబ్‌సైట్ నుంచి మీ టిక్కెట్‌ను బుక్ చేసుకున్నట్లయితే, టిక్కెట్‌ను రద్దు చేయడం ఎలానో తెలుసుకుందాం..
Follow the below steps to Cancel ticket on BookMyShow Official Website…
- BookMyShow అధికారిక వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయండి.
- మీ ఖాతాకు లాగిన్ చేయండి
- కుడివైపున ఉన్న ప్రొఫైల్ మీదకు వెళ్లండి
- కొనుగోలు చరిత్రను(Purchase Histroy) ఎంచుకోండి
- టిక్కెట్‌ను క్లిక్ చేయండి
- కిందకు స్క్రోల్ చేసి.. ఆ తర్వాత రద్దు ఆప్షన్‌పై క్లిక్ చేయండి
- వాపసు చెల్లింపు పద్ధతిని ఎంచుకోండి
- తర్వాత Confirmపై క్లిక్ చేయండి
- NOTE : కొన్నిసార్లు ఈ వెబ్‌సైట్ ఓపెన్ కావట్లేదు.