తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

రణ్​బీర్​ రెమ్యూనరేషన్​ రూ.70 కోట్లు! మరి ఆలియా లెక్క ఎంత? - రణ్​బీర్​ సినిమాలు

Aliabhat Ranbir: ఇటీవలే పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు రణ్​బీర్​కపూర్​-ఆలియా భట్​. హనీమూన్​ కోసం దక్షిణాఫ్రికా వెళ్లనున్నారని తెలిసింది. త్వరగానే ఈ హనీమూన్​ కార్యక్రమాన్ని పూర్తిచేసుకుని షూటింగ్స్​లో పాల్గొంటారట! మరోవైపు ఈ జంట ప్రస్తుతం ఒక్కో సినిమాకు తీసుకునే రెమ్యూనరేషన్ గురించి వార్తలు వస్తున్నాయి. ఎంత పారితోషికం తీసుకుంటున్నారంటే?

రణ్​బీర్​కపూర్​-ఆలియా భట్
రణ్​బీర్​కపూర్​-ఆలియా భట్

By

Published : Apr 17, 2022, 3:03 PM IST

Alia Ranbir Remuneration: దాదాపు ఐదేళ్ల పాటు డేటింగ్​లో ఉన్న బాలీవుడ్​ లవ్​బర్డ్స్​ రణ్​బీర్​ కపూర్​-ఆలియా భట్​ ఎట్టకేలకు ఇటీవలే పెళ్లి పీటలెక్కారు. దీంతో అటు అభిమానుల్లో ఇటు బాలీవుడ్​ చిత్రసీమలో కొత్త ఉత్సాహం నెలకొంది. మీడియాలో ప్రస్తుతం వీరి పెళ్లే హాట్ ​టాపిక్​. ఇక ఈ జంట హనీమూన్​ కోసం దక్షిణాఫ్రికా వెళ్తున్నారని తెలిసింది. త్వరలోనే తిరిగి వచ్చి షూటింగ్స్​లో పాల్గొంటారట! అయితే ఈ నేపథ్యంలో వీరి రెమ్యూనరేషన్​ విషయం గురించి ఓ వార్త బయటకు వచ్చింది. ఆలియా ఒక్కో సినిమాకు రూ.15కోట్లు తీసుకుంటుందని, ఇక రణ్​బీర్​ విషయానికొస్తే.. ఒక్కో చిత్రానికి రూ.60 నుంచి రూ.70కోట్లు తీసుకుంటారని ఇంగ్లీష్​ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

రణ్​బీర్​కపూర్​-ఆలియా భట్

రణ్​బీర్​-ఆలియా సినిమాల విషయానికొస్తే.. వీరిద్దరి కలిసి 'బ్రహ్మాస్త్ర' సినిమాలో నటిస్తున్నారు. ఇటీవలే తొలి భాగం చిత్రీకరణ పూర్తైంది. పోస్ట్​ ప్రొడక్షన్​ పనులు జరుపుకుంటోంది. దీంతో పాటే రణ్​బీర్​.. సందీప్ వంగ దర్శకత్వంలో యానిమల్​ చిత్రంలో నటిస్తుండగా.. ఆలియా 'డార్లింగ్స్',​ 'రాకీ ఔర్​ రాణీ కీ ప్రేమ్​ కహాని' చిత్రాల్లో నటిస్తోంది.

ABOUT THE AUTHOR

...view details