Honey Singh And Shalini Divorce : బాలీవుడ్ నటుడు, సింగర్ యో యో హనీ సింగ్ తన భార్య షాలిని తల్వార్తో విడాకులు తీసుకున్నారు. భరణంగా కోటి రూపాయల చెక్కును సీల్డ్ కవర్లో పెట్టి ఫ్యామిలీ కోర్టుకు సమర్పించారు. అనంతరం విచారణను 2023 మార్చి 22కు వాయిదా వేసింది కోర్టు. అయితే షాలిని మొదట రూ.10 కోట్లు డిమాండ్ చేశారు. చర్చల అనంతరం కోటి రూపాయల భరణానికి ఇద్దరూ అంగీకరించారు.
అయితే, హనీ సింగ్ తనను లైంగికంగా, మానసికంగా వేధింపులకు గురిచేసినట్టు, ఇతర మహిళలతో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్టు ఆరోపిస్తూ అతడి భార్య శాలిని తల్వార్.. దిల్లీలోని తీస్ హజారీ కోర్టులో 'గృహహింస నిరోధక చట్టం' కింద గతేడాది పిటిషన్ దాఖలు చేశారు. సుమారు పదేళ్లపాటు ప్రేమలో ఉన్న హనీసింగ్-షాలిని.. 2011లో వివాహబంధంతో ఒక్కటయ్యారు. అయితే వివాహం అనంతరం వీరిద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తాయి.