తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

జక్కన్న- మహేశ్ సినిమా.. రంగంలోకి హాలీవుడ్ స్టార్.. రెమ్యునరేషన్ రూ.160 కోట్లా?

దర్శకుడు రాజమౌళి-సూపర్ స్టార్ మహేశ్​బాబు కాంబినేషన్​లో రాబోతున్న సినిమా గురించి షాక్​ అయ్యే రేంజ్​లో ఓ వార్త బయటకు వచ్చింది. ఇందులో హాలీవుడ్ స్టార్​ నటించబోతున్నట్లు తెలిసింది.

Rajamouli
రాజమౌళి

By

Published : Sep 23, 2022, 6:35 PM IST

దర్శకధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేశ్​ బాబు కాంబినేషన్​లో రానున్న సినిమా గురించి అదిరిపోయే వార్త బయటకు వచ్చింది. ఈ సినిమా కోసం జక్కన్న హాలీవుడ్ నుంచి ఒక స్టార్ యాక్టర్ ను రంగంలోకి దించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఎక్స్​ఎక్స్​ఎక్స్​, కెప్టెన్​ మార్వెల్​, స్టార్​ వార్స్​, జురాసిక్​ పార్క్​, స్పైడర్​ మ్యాన్, అవెంజర్స్​, కెప్టెన్​ అమెరికా​ వంటి హిట్​ చిత్రాల్లో నటించిన ప్రముఖ హాలీవుడ్ నటుడు శామ్యూల్​ ఎల్​ జాక్స్​ను తీసుకోబోతున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే ఈ వార్తలో ఎంత నిజమున్నదో తెలియాలంటే, అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. కాగా, ఈ నటుడు ఒక్కో చిత్రానికి కనీసం రూ.80కోట్లు నుంచి 160కోట్లు రెమ్యునరేషన్​ను తీసుకుంటాడు. కాగా, ఇటీవలే రాజమౌళి మహేశ్​ సినిమా ఎలా ఉండబోతుందో తెలిపారు. 'ప్రపంచాన్ని చుట్టి వచ్చే సాహసికుడి కథ' అంటూ యాక్షన్‌ అడ్వెంచర్‌ మూవీగా ఇది ఉంటుందని పేర్కొన్నారు. ఈ చిత్రాన్ని పాన్‌ ఇండియా స్థాయిలో కె.ఎల్‌.నారాయణ నిర్మించనున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పూర్వ నిర్మాణ పనులు సాగుతున్నాయి.

ఇదీ చూడండి: విదేశాల్లో 'చెన్నకేశవరెడ్డి' హంగామా.. పవన్​, మహేశ్ కలెక్షన్​ రికార్డులు బ్రేక్!

ABOUT THE AUTHOR

...view details