జేమ్స్ కామెరూన్ అద్భుత సృష్టి అవతార్ 2 విడుదలతో హైదరాబాద్ లోని థియేటర్ల వద్ద సందడి నెలకొంది. సాధారణ థియేటర్లతోపాటు అన్ని మల్టీఫ్లెక్స్ లోనూ అవతార్ 2 తెలుగు, హిందీ, ఇంగ్లిష్ లో 2డీ, 3డీ ఫార్మెట్ లో విడుదల కావడంతో ఆ చిత్రాన్ని చూసేందుకు ప్రేక్షకులు పెద్ద ఎత్తున ఆసక్తి చూపారు. మొదటి భాగం విడుదలైన 13 ఏళ్ల తర్వాత రెండో భాగం రావడంతో అవతార్ 2 అద్భుతాన్ని వీక్షించేందుకు చిన్నాపెద్దలు తరలివచ్చారు. అవతార్ 2 చిత్రం చాలా భావోద్వేగభరితంగా ఉందని, విజువల్స్ ఎఫెక్ట్స్ చాలా చక్కగా ఉన్నాయంటూ ప్రేక్షకులు హర్షం వ్యక్తం చేశారు. అవతార్ 2 లాంటి అద్భుతమైన చిత్రాలు పుష్కరానికోసారి వస్తాయని తెలిపారు. అయితే సినిమా నిడివిపై మరికొంత మంది అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేశారు. కానీ కథ, కథనాల పరంగా ప్రేక్షకులను అవతార్ లో భాగమవుతారని తెలిపారు.
'అవతార్ 2' హంగామా.. థియేటర్‌పై దాడి! - అవతార్ 2 మూవీ స్టోరీ
అవతార్ 2 విడుదలతో హైదరాబాద్ లోని థియేటర్ల వద్ద సందడి నెలకొంది. అయితే ఓ థియేటర్లో చిత్ర ప్రదర్శనకు ఆటంకం కలగడంతో ప్రేక్షకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. థియేటర్‌పై దాడి చేసేందుకు ప్రయత్నించారు.
థియేటర్‌పై దాడి.. అవతార్ 2 చిత్ర ప్రదర్శనకు ఆటంకం కలగడంతో సంగారెడ్డిలోని సితార థియేటర్ లో ప్రేక్షకులు అగ్రహం వ్యక్తం చేశారు. సినిమా ప్రారంభమైన కొద్ది సేపటికే ఆడియో సరిగా రాకపోవడంతో ప్రదర్శన నిలిపివేశారు. దీంతో ఒక్కసారిగా ప్రేక్షకులంతా ఆగ్రహానికి గురై థియేటర్ పై దాడి చేసేంత పనిచేశారు. థియేటర్ యాజమాన్యం ప్రేక్షకులకు సర్దిచెప్పి సినిమాను మళ్లీ మొదటి నుంచి ప్రదర్శించడంతో ప్రేక్షకులు శాంతించారు.
ఇదీ చూడండి:టైటానిక్ హీరోయిన్ సాహసం.. అవతార్ 2 కోసం నీటిలో 7 నిమిషాలు ఊపిరి తీసుకోకుండా..