Danny Masterson Verdict : అత్యాచార కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ హీరో డానీ మాస్టర్‌సన్‌ను న్యాయస్థానం నిందితుడిగా తేల్చింది. యువతులపై అత్యాచారానికి పాల్పడినందుకుగానూ 'దట్ సెవంటీస్' షో స్టార్‌కు 30 ఏళ్ల జైలు శిక్ష విధిస్తున్నట్లు తాజాగా తీర్పును వెలువరించింది. కాగా డానీ మాస్టర్‌సన్ 2001లో ఓ 23 ఏళ్ల యువతిపై, అలాగే 2003లో మరో 28 ఏళ్ల యువతిపై అత్యాచారానికి పాల్పడగా.. 2003 చివరిలో మరో 23 ఏళ్ల యువతిని ఇంటికి పిలిచి మరీ అత్యాచారం చేసినట్లు అతనిపై వివిధ కేసులు నమోదయ్యాయి.
దీనిపై 2020 జూన్‌లోనే విచారణ జరిపిన న్యాయస్థానం ఆయనకు జైలు శిక్ష విధించింది. అయితే 3.3 మిలియన్ డాలర్లు చెల్లించిన డానీ.. అదే రోజు జైలు నుంచి విడుదలయ్యాడు. కాగా ఈ విషయంపై బాధితులు మరోసారి న్యాయస్థానాన్ని ఆశ్రయించగా.. తాజాగా కోర్టు ఈ కేసుపై విచారణ జరిపించింది. అలా తాజాగా మరోమారు విచారణ జరగ్గా.. ఈ సారి డానీ మాస్టర్‌సన్‌ను నిందితుడిగా తేల్చిన న్యాయస్థానం అతనికి 30 ఏళ్ల జైలు శిక్షను విధించింది. 2001, 2003లో అత్యాచారానికి పాల్పడ్డాడన్న ఆరోపణలు రుజువు కాగా.. 2003 ఏడాది చివరిలో హాలీవుడ్ హిల్స్‌లోని తన ఇంటికి తీసుకెళ్లి ఓ యువతిని అత్యాచారం చేశాడన్న ఆరోపణలో మాత్రం ఎటువంటి ఆధారాలు లభ్యం కానట్లు తెలిసింది.