తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'మేము పిలిచాము.. ఆయనే రాలేదు'.. NTR ఫ్యాన్స్​కు HCA అవార్డ్స్​ క్లారిటీ - జూనియర్​ ఎన్టీఆర్​కు హెచ్​ సి ఏ అవార్డు

ప్రతిష్టాత్మక హాలీవుడ్​ క్రికెట్​ అసోషియేషన్ అవార్డుల వేడుకకు జూనియర్​ ఎన్టీఆర్​ హాజరు కాలేదు. దీంతో ఫ్యాన్స్​ హెచ్​సీఏ కమిటీపై ఫుల్​ ఫైర్​ అయ్యారు. దీంతో ఆ సోషియేషన్​ అభిమానులకు క్లారిటీ ఇంచ్చింది. ఎన్టీఆర్​ హెచ్​సీఏ ఆవార్డ్స్ వేడుకకు వెళ్లకపోవడానికి కారణమిదే..​

hollywood critics association
jr ntr

By

Published : Feb 28, 2023, 1:50 PM IST

'ఆర్​ఆర్​ఆర్'​ చిత్రం అవార్టుల వేట కొనసాగిస్తోంది. ప్రతిష్టాత్మక హాలీవుడ్ క్రిటిక్​ అసోషియేషన్ అవార్డులు నాలుగు గెలుచుకుంది. కాగా ఈ అవార్డులను అందుకునేందుకు 'ఆర్​ఆర్​ఆర్'​ టీమ్ నుంచి దర్శకుడు రాజమౌళి, హీరో రామ్​ చరణ్​, మ్యూజిక్​ డైరెక్టర్​ కీరవాణి, సినిమాటోగ్రాఫర్​ సెంథిల్ లాస్​ఏంజెలెస్​ వెళ్లారు. రామ్​ చరణ్​కు ఈ ఈవెంట్​లో స్పాట్​ లైట్​ అవార్డు దక్కింది. అంతే కాకుండా ఈ వేడుక​లో ఈ చరణ్​తో పాటు మూవీ టీమ్ అంతా సందడి చేసింది. ఆ ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరలయ్యాయి. అయితే, ఎన్టీఆర్​ను ఆహ్వానించలేదని​ అభిమానులు హాలీవుడ్​ క్రిటిక్స్​ అవార్డ్స్​ అసోషియేషన్​పై​ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సామాజిక మాధ్యమాల్లో హెచ్​సీఏను ట్రోల్​​ చేశారు. తమ అభిమాన హీరోను అగౌరవపరిచారంటూ కామెంట్లు చేశారు.

ఈ విషయంపై స్పందించిన హాలీవుడ్​ క్రిటిక్స్​ అవార్డ్స్​ అసోషియేషన్​ ట్విట్టర్​ వేదికగా ఎన్టీఆర్​ వేడుకకు హాజరు కాకపోవడంపై క్లారిటీ ఇచ్చింది. "డియర్​ ఆర్ఆర్​ఆర్​ ఫ్యాన్స్​.. హెచ్​సీఏ అవార్డుల కార్యక్రమానికి ఎన్టీఆర్​ రావాలని మేము ఆహ్వానించాము. అయితే ఆయన ఇండియాలో ఓ సినిమా షూట్​లో ఉన్నందున ప్రస్తుతం ఆయన ఇక్కడికి రాలేకపోయారు. త్వరలోనే మేము ఆయనకు ఈ అవార్డును అందజేస్తాము" అంటూ ట్విట్టర్​లో తెలిపారు.​

ఇక సినిమాల విషయానికి వస్తే.. 'ఆర్​ఆర్​ఆర్' సినిమా తర్వాత తారక్.. కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమాకు సైన్​ చేశారు. 'ఎన్టీఆర్ 30' అనే వర్కింగ్​ టైటిల్​తో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూట్​.. మార్చి 18న ప్రారంభం కానుంది. ఏప్రిల్‌ నుంచి రెగ్యులర్​ చిత్రీకరణ మొదలు కానుందని తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయంపై స్పష్టత ఇవ్వనుంది సినిమా యూనిట్. ఇప్పటికే భారీ అంచనాలు పెంచిన ఈ సినిమా.. వచ్చే ఏడాది ఏప్రిల్‌ 5న పాన్‌ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.

ABOUT THE AUTHOR

...view details