పరిశోధనాత్మక కథలతో వరుసగా ఓ యూనివర్స్‌ని సృష్టించే దిశగా 'హిట్' సిరీస్ ప్రారంభమైంది. తొలి కేస్‌తో కూడిన సినిమాలో విష్వక్‌సేన్ నటించగా, రెండో కేస్‌తో అడివి శేష్ రంగంలోకి దిగారు. తాజాగా విడుదలైన ఈ రెండో భాగం సూపర్ రెస్పాన్స్‌ను అందుకుంటోంది. హిట్ మొదటి కేస్ ఎంత హిట్ అయ్యిందో సెకండ్ కేస్ కూడా అంతే హిట్టు కొట్టిందని చెబుతున్నారు. అయితే ఈ హిట్ యూనివర్స్‌ను మొత్తం 7 భాగాలుగా ప్లాన్ చేసినట్లు నిర్మాతల్లో ఒకరైన నేచురల్ స్టార్ నాని ఇప్పటికే తెలిపారు. ఈ ప్రకటన తర్వాత ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ముూడో భాగంలో ఎవరు ఉండబోతున్నారు అనే దానిపై ఇప్పటికే క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈసారి నేచురల్ స్టార్ నాని కూడా కనిపిస్తారని, అలాగే విజయ్ సేతుపతిని కూడా నటించనున్నారని ప్రచారం సాగుతోంది.
అడివి శేష్ 'హిట్' ఫ్రాంచైజీలో మహేశ్, పవన్ కనిపిస్తారా? - హిట్ ఫ్రాంచైజీ పవన్ కల్యాణ్
'హిట్' ఫ్రాంచైజీ గురించి ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. ఇందులో సూపర్ స్టార్ మహేశ్‌బాబు, పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ భాగం అయ్యే అవకాశం ఉందంటూ ప్రచారం సాగుతోంది.
అయితే ఇప్పుడు ఈ హిట్ యూనివర్స్‌లోకి రాబోయే మరి కొందరు పేర్లు అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. అందులో టాలీవుడ్ టాప్ హీరోలు పవన్ కల్యాణ్, సూపర్ స్టార్ మహేశ్ బాబు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ కామెంట్స్ చేసింది మరెవరో కాదు.. ఏకంగా నిర్మాత నాని, హీరో అడివి శేష్! యాంకర్ సుమతో కలిసి వీళ్లు సినిమా ప్రమోషన్స్ చేశారు. ఆ సమయంలో సుమ వీరిని పవన్ కల్యాణ్- మహేశ్ బాబు రాబోతున్నారా ఈ హిట్ యూనివర్స్‌లోకి అంటూ ప్రశ్నించింది. అందుకు నాని వాళ్లు రారు అని చెప్పలేదు. పైగా రావచ్చేమో అంటూ పరోక్షంగా రెస్పాండ్ అయ్యారు. దీంతో హిట్ ఫ్రాంచైజీలో మహేశ్-పవన్ పేర్లు ట్రెండింగ్ అవుతున్నాయి.
ఇదీ చూడండి:ఘనంగా దర్శకుడు గుణశేఖర్ కూతురి వివాహం