తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

ఓ ఇదా అడివిశేష్​ సక్సెస్​ మంత్ర.. అందుకేనా ఇలా వరుస హిట్లు?

'క్షణం' నుంచి 'హిట్‌-2‌' వరకు వరుసగా ఆరు సినిమాలతో హీరోగా విజయాన్ని అందుకున్న నటుడు అడివి శేశ్​ . ప్రస్తుతం 'హిట్‌-2' విజయోత్సవ యాత్రలో భాగంగా వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తోన్న ఆయన తాజాగా ట్విటర్‌ చాట్‌లో పాల్గొన్నారు. అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.

Adavisesh twitter chat
ఓ ఇదా అడివిశేష్​ సక్సెస్​ మంత్ర.. అందుకేనా ఇలా వరుస హిట్లు?

By

Published : Dec 10, 2022, 4:52 PM IST

'హిట్‌-2' విజయోత్సవ యాత్రలో భాగంగా వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తోన్న యంగ్ హీరో అడివిశేష్​.. తాజాగా ట్విటర్​ చాట్​లో పాల్గొన్నారు. ఇందులో భాగంగా తన కథలను ఎలా ఎంచుకుంటారో చెప్పారు. దీంతో ఆయన సమాధానం విన్న అభిమానులు ఓ ఇదా మీ సక్సెస్ సీక్రెట్​ అని అంటున్నారు. ఆ సంగతులు..

'గూఢచారి-2' రిలీజ్‌ ఎప్పుడు?
శేష్‌: ప్రస్తుతం 'హిట్‌-2' విజయాన్ని ఆనందిస్తున్నా. త్వరలోనే 'గూఢచారి-2' కథ రాసి.. అద్భుతమైన దర్శకుడు వినయ్‌తో ఈ సినిమా చేస్తా.
మీకు బాగా నచ్చిన మ్యూజిక్‌ కంపోజర్‌ ఎవరు?
శేష్‌: హన్స్ జిమ్మెర్, థామస్‌ న్యూమాన్‌, అనిరుధ్‌, శ్రీచరణ్‌ పాకాల.
'హిట్‌-2' చాలా బాగుంది? మీరు బెంగళూరు ఎప్పుడు వస్తారు?
శేష్‌: ఇటీవల 'హిట్‌-2' ప్రమోషన్స్‌ కోసం అక్కడికి వచ్చాను. త్వరలోనే నా తదుపరి సినిమా షూట్‌ కోసం కూడా రావొచ్చు. ఆ నగరం నాకెంతో నచ్చింది.

రాహుల్‌ రవీంద్రన్‌ డైరెక్షన్‌లో ఎప్పుడు సినిమా చేస్తారు?
శేష్‌: రాహుల్‌ బ్రో.. అదీ సంగతి!

మీరు యాక్షన్‌ మూవీ చేస్తే చూడాలని ఉంది?

శేష్‌: నెట్‌ఫ్లిక్స్‌లో 'మేజర్‌' అందుబాటులో ఉంది. అలాగే థియేటర్‌లో 'హిట్‌-2' చూడండి.

హిట్‌వర్స్‌లో మీకూ, విశ్వక్‌సేన్‌కు ఫైట్‌ ఉండే అవకాశం ఉందా?

శేష్‌: ఉంటే ఉండొచ్చు. నేను కూడా దర్శకుడు శైలేష్‌ను అడగలేదు.

అమ్మాయిలకే రిప్లైలు ఇస్తున్నావు. అబ్బాయిలకు ఇవ్వడం లేదు. ఎందుకంత పక్షపాతం?

శేష్‌: అబ్బాయిలు.. తన గర్ల్‌ఫ్రెండ్స్‌ని మాత్రమే సినిమాలకు తీసుకువెళ్తున్నారు. అమ్మాయిలు అయితే కుటుంబం మొత్తాన్ని థియేటర్‌కు తీసుకువెళ్తున్నారు. అదీ లెక్కా. నేను సరదాగా అన్నాను. ఎవరినైనా ఒకేలా ఇష్టపడతాను.

సినిమా కథలను మీరు ఎలా ఎంచుకుంటున్నారు?

శేష్‌: సినిమా కథల విషయంలో నేను చాలా తేలికగా నిర్ణయం తీసుకుంటా. ఎవరైనా నాకు కథలు చెప్పినప్పుడు ప్రేక్షకుడిగా వింటాను. ఒకవేళ అది బోర్‌ కొడితే వెంటనే నో అని చెప్పేస్తాను. ఆసక్తిగా అనిపిస్తే ఓకే చెబుతాను. హీరోగా ఎప్పుడూ కథలు వినలేదు. సినిమాల్లో బిల్డప్‌ అనేది అవసరం లేదు. సినిమా బాగుంటే ప్రేక్షకులే నాకు బయట బిల్డప్‌ ఇస్తారు. 'హిట్‌-2' విషయంలోనూ అదే జరిగింది.

కన్నడ చిత్రపరిశ్రమపై మీ అభిప్రాయం ఏమిటి?
శేష్‌: కన్నడంలో నా సినిమాలకు నేనే డబ్బింగ్‌ చెప్పాలనుకుంటున్నా. చెప్పగలననే ధైర్యం వచ్చినప్పుడు తప్పకుండా ఆ పని చేస్తా. కొత్త సినిమాలతో కన్నడ వాళ్లు రికార్డులు క్రియేట్‌ చేస్తున్నందుకు ఆనందంగా ఉంది.
ఇప్పటివరకూ ఆరు హిట్స్‌ ఇచ్చారు కదా? తదుపరి చిత్రాన్ని టాప్‌ దర్శకులతో చేస్తారా?

శేష్‌: పెద్దా, చిన్నా, దక్షిణాది, ఉత్తరాది అనేది కాదు. కథ బాగుంటే చాలు. అలాగే దర్శకుడు కూడా నాకు నచ్చిన వ్యక్తి అయితే చాలు.
కూకట్‌పల్లి వర్సెస్‌ అమీర్‌పేట్‌.. దీనికి సమాధానం చెప్పండి?
శేష్‌: కూకట్‌పల్లిలో సినిమా చూసి.. అమీర్‌పేట్‌కు వెళ్లి షాపింగ్‌ చేయండి.

ఇదీ చూడండి:నిర్మాత సురేశ్ బాబు కీలక కామెంట్స్​.. వాటిని ఎవరూ ఆపలేరంటూ

ABOUT THE AUTHOR

...view details