Highest Paid Actor In India :భారతీయ చలన చిత్ర రంగంలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి.. స్టార్‌గా ఎదిగిన వారున్నారు. మరికొందరు తమ పూర్వీకులు, బంధువులు, కుటుంబ సభ్యుల సహకారంతో వచ్చి పేరు స్టార్డం తెచ్చుకున్నవారు కూడా ఉన్నారు. మంచి బ్యాక్ గ్రౌండ్‌తో వచ్చినా.. సరైన గుర్తింపు తెచ్చుకోలేక చతికిలపడ్డవాళ్లు కూడా ఇండస్ట్రీలో ఉన్నారు.
అయితే ఎంత మంచి నేపథ్యం నుంచి వచ్చినా కూడా.. ఆ స్టార్ డమ్‌ను కొనసాగించడం అనేది కత్తి మీద సామే. అలా పేరున్న నేపథ్యం నుంచి వచ్చిన ఓ స్టార్.. రూ. 500 కంటే తక్కువ రెమ్యునరేషన్‌తో బాల నటుడిగా కెరీర్‌ను ప్రారంభించారు. క్రమంగా ఎదుగుతూ.. తన టాలెంట్‌తో హీరో అయ్యారు. ప్రస్తుతం ఇండియాలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న నటుల్లో ఒకడిగా నిలిచారు. ఇప్పుడు సినిమాకు రూ.200 కోట్లు తీసుకుంటున్నారు.
ఇంతకీ ఎవరా కథానాయకుడు అంటే.. తమిళులతో పాటు సినీ ప్రేమికులు దళపతి అంటూ ముద్దుగా పిలుచుకునే విజయ్. 80వ దశకంలో బాల నటుడిగా కెరీర్‌ను ఆరంభించిన విజయ్.. రూ.500ను తన తొలి రెమ్యునరేషన్‌గా అందుకున్నారు. ఇక 1984లో తన తండ్రి ఎస్ఏ చంద్ర శేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన 'వెట్రి' అనే సినిమాతో హీరోగా తెరంగేట్రం చేశారు. 2000 ప్రారంభంలో విజయ్.. హీరోగా సినిమాలు చేయడం ప్రారంభించారు. కానీ స్టార్ డమ్ మాత్రం ఆ ఏడాది చివర్లో వచ్చింది. 2010 మధ్యలోకి వచ్చే సరికి ప్రజల్లో మంచి క్రేజ్ సంపాదించుకుని.. రజనీ కాంత్, కమల్ హాసన్ లాంటి స్టార్ హీరోల సరసన చేరారు.