Hi Nanna Teaser :నేచురల్ స్టార్ నాని-సీతారామం ఫేమ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న చిత్రం 'హాయ్ నాన్నా'. దర్శకుడు శౌర్యువ్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాతోనే శౌర్యువ్ డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నాడు. ఇక నిర్మాతలు విజయేందర్ రెడ్డి, వెంకట మోహన్ సంయుక్తంగా.. వైర ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రూపొందిస్తున్నారు. అయితే ఈ సినిమా టీజర్‌ను మూవీ యూనిట్ హైదరాబాద్‌లో ఆదివారం విడుదల చేసింది.
ఫీల్‌గుడ్ లవ్‌స్టోరీ.. ఈ సినిమాలో హీరో నాని తండ్రి పాత్రలో కనిపించనున్నారు. మూవీ స్టోరీలో తండ్రీ, కుమార్తె మధ్య అనుబంధంతో పాటు, డీసెంట్ లవ్ స్టోరీ యాడ్ చేశారు. పెళ్లికి ముందు హీరోతో లవ్‌లో పడిన అమ్మాయి పాత్రలో మృణాల్ ఒదిగిపోయారు. ఇద్దరి మధ్య ఫీల్‌గుడ్ లవ్‌స్టోరీతో పాటు కెమీస్ట్రీ కూడా బాగుందంటూ నెటిజన్లు అంటున్నారు. ఇక టీజర్ రిలీజైన రెండు గంటల్లోనే నాలుగు లక్షలకుపైగా వ్యూస్‌తో దూసుకుపోతోంది.
ఇక టీజర్లో చూపించిన పాప, నాని సొంత కూతురా.. కాదా?, మరి పెళ్లి ఫిక్స్ అయిన మృణాల్తో నాని లవ్ స్టోరీ ఎక్కడిదాకా వెళ్లింది? ఇవన్నీ తెలియాలంటే సినిమా విడుదల వరకూ ఆగాల్సిందే! కాగా, ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన.. 'సమయమా', 'గాజు బొమ్మ' పాటలు.. ఆడియోన్స్‌ను ఆకట్టుకుంటున్నాయి.