Hi Nanna Movie Promotions :'దసరా' సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు పొందారు నేచురల్ స్టార్ నాని. తన 15 ఏళ్ల సినీ కెరీర్లో ఆఫ్ బీట్ సినిమాలు చేసి టాలీవుడ్ ప్రేక్షకుల్లో మంచి ఫ్యాన్ బేస్ పెంచుకున్నారు. హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా ఇండస్ట్రీలో దూసుకెళ్తున్నారు. 'జెర్సీ' సినిమాలో క్రికెటర్లా కనిపించిన నాని.. నాన్న పాత్రతో అందరిని భావోద్వేగాలతో ముంచెత్తారు. ఆ సినిమాలో రోల్‌కు ఆయన ప్రశంసలు కూడా అందుకున్నారు. అయితే తాజాగా మరోసారి ఆయన నాన్న రోల్లో సిల్వర్ స్క్రీన్‌పై కనిపించనున్నారు. 'హాయ్ నాన్న ' చిత్రంతో ప్రేక్షకులను పలకరించనున్నారు. తండ్రీ కూతుళ్ల సెంటిమెంట్‌తో రూపొందిన ఈ సినిమా డిసెంబర్ 7న థియేటర్లలో విడుదల కానుంది. ఇక సినిమా రిలీజ్‌కు 30 రోజులే ఉన్నందున మూవీ టీమ్ ప్రమోషన్స్‌ను ముమ్మరం చేసింది. అయితే నాని ఇప్పుడు ఒంటరి పోరాటం చేస్తున్నట్లు కనిపిస్తున్నారు. తన మూవీ ప్రమోషన్స్ కోసం పలు రకాలుగా ప్రయత్నిస్తున్నారు.
ఇప్పటికే ప్రమోషన్స్‌లో భాగంగా పలు ఇంటర్వ్యూలకు, షోలకు వెళ్లిన మూవీ టీమ్.. ప్రచారంలో భాగంగా సందడి చేస్తూ కనిపిస్తోంది. తాజాగా ఓ కాలేజీ ఈవెంట్లో హీరో నాని, హీరోయిన్ మృణాల్తో పాటు డైరెక్టర్ శౌర్యువ్, మ్యాజిక్ డైరెక్టర్ హేషమ్ హాజరయ్యారు. కాసేపు ఫ్యాన్స్‌తో ముచ్చటించి సందడి చేశారు. అంతే కాకుండా తమ సినిమాలోని 'అమ్మాడి' సాంగ్‌ను ఆ వేదికపై విడుదల చేశారు. ఆ తర్వాత నుంచి నాని సోలో షో మొదలైంది. తాజాగా ఓ న్యూస్ ఛానెల్ నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో నాని పాల్గొన్నారు. తన ప్రోఫషనల్ లైఫ్‌తో పాటు సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. ఇలా అన్ని ఈవెంట్లలోనూ నాని.. తన సినిమా గురించి వీలైనంత ప్రచారం చేస్తున్నారు. అభిమానుల్లో ఈ సినిమాపై అంచనాలు పెంచుతున్నారు.