Pawan Kalyan Martial Arts: మార్షల్ ఆర్ట్స్‌లో ప్రావీణ్యం ఉన్న తెలుగు హీరో ఎవరంటే? అందరూ చెప్పే సమాధానం పవన్ కల్యాణ్. పలు చిత్రాల్లోనూ తన ప్రతిభను ప్రదర్శించారు. అదే ప్రధానాంశంగా 'జాని' సినిమాను తానే స్వయంగా తెరకెక్కించారు. ఆ తర్వాత మార్షల్ ఆర్ట్స్‌కు దూరమైన పవన్ మళ్లీ ప్రాక్టీస్‌ను ప్రారంభించినట్టు సోషల్ మీడియా వేదికగా తెలిపారు. సంబంధిత ఫొటో షేర్ చేస్తూ.. రెండు దశాబ్దాల తర్వాత మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్‌ని ప్రారంభించానని పేర్కొన్నారు.
20 ఏళ్లు బ్రేక్.. ఇప్పుడు మళ్లీ మొదలుపెట్టిన పవన్.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ! - పవన్ కల్యాణ్ అప్డేట్లు
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ షేర్ చేసిన ఓ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ ఫొటో చూసిన ఫ్యాన్స్.. 'అప్పటికీ ఇప్పటికీ ఏం మారలేదన్నా నీ ఫైర్', 'వింటేజ్ లుక్' అంటూ కామెంట్ చేస్తున్నారు.
పవన్ ఫొటో పంచుకోవడమే ఆలస్యం ఆయన అభిమానులు దాన్ని క్షణాల్లోనే వైరల్ చేశారు. పవన్ కల్యాణ్ గతంలో మార్షల్ ఆర్ట్స్ గురించిన చెప్పిన మాటలు, ఆయన చేసిన ప్రాక్టీస్‌ను గుర్తు చేసుకుంటున్నారు. 'అప్పటికీ ఇప్పటికీ ఏం మారలేదన్నా నీ ఫైర్', 'వింటేజ్ లుక్' అంటూ కామెంట్ చేస్తున్నారు.
'భీమ్లా నాయక్'తో ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన పవన్ ప్రస్తుతం 'హరిహర వీరమల్లు' సినిమాలో నటిస్తున్నారు. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఆ చిత్రంలోని పాత్ర కోసమే పవన్ మార్షల్ ఆర్ట్స్ సాధన చేస్తున్నారు. 17వ శతాబ్దంనాటి చారిత్రక నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమాలో నిధి అగర్వాల్ కథానాయిక. 'సాహో' ఫేం సుజిత్ డైరెక్షన్‌లో పవన్ ఓ చిత్రం ఖరారు చేశారు. హరీశ్ శంకర్‌తో ఓ సినిమా చేయనున్నారు.