తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

జర్నలిస్ట్​పై మండిపడ్డ తాప్సీ.. అలా ఎందుకు చేయరంటూ.. - రిపోర్టర్​పై తాప్సీ ఫైర్​

ఓ అవార్డు ఫంక్షన్​లో పాల్గొన్న హీరోయిన్ తాప్సీ.. రిపోర్టర్​పై మండిపడింది. 'ప్రశ్నలు అడిగేటప్పుడు హోంవర్క్‌ చేసుకుని రాలేరా' అని ప్రశ్నించింది.

tapsee
తాప్సీ

By

Published : Sep 14, 2022, 4:12 PM IST

హీరోయిన్​ తాప్సీ ప్రస్తుతం బాలీవుడ్‌లో వరుసగా సినిమాలు చేస్తోంది. అంతేకాదు, ముక్కుసూటిగా మాట్లాడుతూ.. నిత్యం వార్తల్లో నిలుస్తోంది. తాజాగా ఓ అవార్డు ఫంక్షన్‌లో పాల్గొన్న ఆమె విలేకరిపై మండి పడింది. 'ప్రశ్నలు అడిగేటప్పుడు హోంవర్క్‌ చేసుకుని రాలేరా' అని మండిపడింది.

ఇంతకీ ఏం జరిగిందంటే.. 'ఓటీటీ ప్లే అవార్డ్స్‌ 2022' కార్యక్రమంలో పాల్గొన్న తాప్సీని విలేకరి పలు ప్రశ్నలు అడిగారు. ముఖ్యంగా ఇటీవల ఆమె నటించిన ‘దొబారా’ సినిమాపై వచ్చిన నెగెటివ్‌ టాక్‌ గురించి అడగ్గా, 'నెగెటివ్‌ టాక్‌ బారిన పడని చిత్రమేదైనా ఉందా?' అని ఎదురు ప్రశ్నించింది. ఇంతలోనే మరో ప్రశ్న అడిగేందుకు ప్రయత్నించగా, మధ్యలో కలగజేసుకుని, 'ముందు నా ప్రశ్నకు సమాధానం చెబితే, మీకు నేను సమాధానం చెబుతా. చెప్పండి ఏ చిత్రానికి నెగెటివ్‌ టాక్‌ రాలేదు' అని కాస్త గట్టిగానే ప్రశ్నించింది.

తాప్సీ అన్న మాటలకు విలేకరి స్పందిస్తూ విమర్శకులు కూడా మెచ్చుకోలేదు కదా? అని అనగా, 'ఇలాంటి ప్రశ్నలు అడిగేటప్పుడు కాస్త హోంవర్క్‌ చేసుకుని రండి. పైగా మర్యాదలేకుండా మాట్లాడారని మమ్మల్ని(నటులు) అంటారు' అని ఘాటుగా స్పందించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది. 'ఆమె సరిగ్గానే స్పందించింది' అని ఒక అభిమాని కామెంట్‌ చేయగా, 'ఆమె ఎందుకు ఎప్పుడూ కోపంతో ఊగిపోతు ఉంటుంది' అని మరొకరు కామెంట్‌ చేశారు. అనురాగ్‌ కశ్యప్‌ దర్శకత్వంలో తెరకెక్కిన సైన్స్‌ ఫిక్షన్‌ థ్రిల్లర్‌గా 'దొబారా' తెరకెక్కింది. టైమ్‌ ట్రావెల్‌ నేపథ్యంలో సాగే ఈ కథ ప్రేక్షకులను అంతగా మెప్పించలేదు. ఇక ఓటీటీ ప్లే 2020 అవార్డుల్లో భాగంగా 'హసీనా దిల్‌రుబా' చిత్రానికిగానూ తాప్సీ ఉత్తమ కథానాయికగా అవార్డును సొంతం చేసుకుంది.

ఇదీ చూడండి: స్టేజ్​పై 'మిర్చి' సాంగ్​కు కృష్ణంరాజు డ్యాన్స్​.. అదే చివరిసారిగా

ABOUT THE AUTHOR

...view details