ఏప్రిల్ 8 టాలీవుడ్ హీరో అక్కినేని అఖిల్ బర్త్‌డే. ఈ సందర్భంగా సామాజిక మాధ్యమాల వేదికగా ఈ యంగ్ హీరోకు అభిమానులు, ప్రముఖులు విషెస్ తెలుపుతున్నారు. అయితే ఇదంతా కామనే అయినప్పటికీ ఓ వ్యక్తి చేసిన విష్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది ఇంకెవరిదో కాదు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతది. అక్కినేని ఇంటి మాజీ కోడలైన ఈ తార.. అఖిల్‌కు బర్త్‌డే విషస్ చెప్పింది.
అఖిల్ నటిస్తున్న ఏజెంట్ సినిమా పోస్టర్‌ను ఇన్‌స్టాలో పోస్ట్ చేసి.. దానికి 'హ్యాపీ బర్తడే అఖిల్.. ఏజెంట్ ఆన్ ఏప్రిల్ 28.. దిజ్ ఈజ్ గోయింగ్ టు బి ఫైర్.. లాట్స్ ఆఫ్ లవ్ అంటూ క్యాప్షన్‌ను రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. అయితే నాగచైతన్యతో విడిపోయినా కూడా అక్కినేని కుటుంబంతో మాత్రం సమంతకు ఇప్పటికీ మంచి అనుబంధం ఉంది అన్న విషయం ఈ ఒక్క పోస్ట్‌తో నిరూపితమయ్యిందని అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. అయితే గతేడాది కూడా అఖిల్ బర్త్‌డేకు సామ్ విష్ చేసినా.. అఫీషియల్‌గా అయితే అఖిల్ స్పందించినట్లు కనిపించలేదు. పర్సనల్‌గా థాంక్యూ చెప్పుండచ్చని అభిమానులు అంటున్నారు. మరి ఈ సారైనా అఖిల్ అఫీషియల్‌గా స్పందిస్తారా లేదా అని ఎదురుచూస్తున్నారు.