హీరోయిన్ సమంత ప్రస్తుతం 'సిటాడెల్' అనే యాక్షన్ వెబ్ సిరీస్‌లో నటిస్తున్నారు. ఈ సిరీస్ కోసం కఠినతరమైన స్టంట్స్ కూడా చేస్తున్నారు. ఆ మధ్య షూటింగ్లో భాగంగా రెండు చేతులకు గాయాలైన ఫోటోలను కూడా పోస్ట్ చేశారు. ఇప్పుడు మళ్లీ ఓ కొత్త ఫొటోనూ పోస్ట్ చేసి 'ఇట్స్ టార్చర్ టైమ్' అని రాసుకొచ్చారు. ఐస్ బాత్ టబ్‌లో కూర్చున్న ఫొటోను పోస్ట్ చేశారు. యాక్షన్ సీన్స్‌లో నటిస్తున్నట్లు చెప్పిన సామ్.. టార్చర్లా ఉందని.. రికవరీ కోసం ఇలా ఐస్ బాత్ టబ్‌లో కూర్చొని ఉపశమనం పొందుతున్నట్లు వెల్లడించారు. మరి ఇంత కష్టపడుతున్న సమంతకు 'సిటాడెల్' ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.
ఇకపోతే సిటాడెల్ ఇంటర్నేషనల్ వెబ్‌సిరీస్. ఇంగ్లీష్ వెర్షన్లో ప్రియాంక చోప్రా నటించారు. ఇండియన్ వెర్షన్ లో సమంత నటిస్తున్నారు. ఇప్పటికే ప్రియాంక చోప్రా నటించిన సిరీస్ ఏప్రిల్ 28న రిలీజై.. అమెజాన్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో బోల్డ్ కంటెంట్ సన్నివేశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. ఈ సన్నిహిత సన్నివేశాల్లో నటించేందుకు తాను చాలా ఇబ్బంది కూడా పడినట్లు ప్రియాంక చోప్రా చెప్పుకొచ్చారు. ఇలాంటి బోల్డ్ సీన్స్.. ఇండియన్ వెర్షన్ సిరీస్‌లో వరుణ్ ధావన్-సమంత మధ్య కూడా ఉంటాయని అంటున్నారు. అయితే ఇండియన్ ఆడియన్స్‌ను దృష్టిలో పెట్టుకొని కాస్త డోస్ తగ్గించే అవకాశం ఉందని చెబుతున్నారు. దీనికి 'ది ఫ్యామిలీ మ్యాన్' సిరీస్ ఫేమ్ రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహిస్తున్నారు.