Sai pallavi surgery : సాయి పల్లవి.. ఈ పేరుకున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎక్స్ పోజింగ్ చేయదు. మేకప్ వేసుకోదు. హీరోయిన్‌కు యాక్టింగ్ స్కోప్ ఉండే పాత్రలను ఓకే చేస్తుంది. అలా ఈ నేచురల్ బ్యూటీ.. తన సినిమాలతో, వ్యక్తిత్వంతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. అలాగే ఇండస్ట్రీలోనూ తనదైన ముద్ర వేసుకుంది. ప్రతి సినిమాలోనూ అద్భుతమైన నేచురల్ పెర్ఫామెన్స్‌తో స్పెషల్ ఇమేజ్ను సొంతం చేసుకుంది. అలా తెలుగుతో పాటు తమిళం, మలయాళంలోనూ తన టాలెంట్, వ్యక్తిత్వంతో మంచి నటిగా గుర్తింపును అందుకుంది.
అయితే లేడి పవర్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న ఈ బ్యూటీ గతంలో ఓ సారి సర్జరీ చేయించుకుందట. ఈ విషయాన్ని పలు వెబ్సైట్లు కథనాలుగా ఇప్పుడు రాస్తున్నాయి. అయితే ఆమె అందం కోసం సర్జరీ చేయించుకోలేదట. సాధారణంగానే సాయిపల్లవి ఎంత చక్కటి డ్యాన్సరో తెలిసిన విషయమే. అలా ఓ సారి డ్యాన్స్ చేస్తున్న క్రమంలో సాయి పల్లవి కాలుకి చిన్న గాయమైందట. అప్పుడే ఆమె సర్జరీ చేయించుకోవాల్సి వచ్చిందని కథనాలు బయట కనపడుతున్నాయి. ఇప్పటికీ సాయి పల్లవికి డ్యాన్స్ చేసేప్పుడు ఆ కాలుకు కాస్త నొప్పి వస్తుందని కూడా అందులో రాసి ఉంది.
ఇకపోతే సాయిపల్లవి ప్రస్తుతం.. గతేడాది 'విరాటపర్వం', 'గార్గి' చిత్రాలతో అలరించింది. కానీ అవి కమర్షియల్ పరంగా బాక్సాఫీస్ వద్ద కాస్త నిరాశపరిచాయి. కానీ ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. దీంతో సాయి పల్లవి చిత్రాలకు కాస్త బ్రేక్ ఇచ్చింది. సోషల్‌మీడియాలోనూ చురుగ్గా కనపడలేదు. దీంతో ఆమె సినిమాలకు గుడ్ బై చెప్పనుందా అనే సందేహాలు కూడా వచ్చాయి. ఆ సమయంలోనే తమిళ హీరో శివ కార్తికేయన్‌తో కలిసి ఓ సినిమా చేస్తున్నట్లు తెలిపింది. యూనివర్సల్ స్టార్ కమల్‌హాసన్, ఆర్.మహేంద్రన్ సంయుక్త నిర్మాణంలో ఈ చిత్రం రూపొందుతోంది. రాజ్‌కుమార్ పెరియసామి డైరెక్షన్ చేస్తున్నారు. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ సంస్థ సమర్పిస్తోంది. ఈ సినిమా కోసం సాయి పల్లవి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.