'స్వయంవరం' సినిమాతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న నటి లయ. కేవలం ఫ్యామిలీ తరహా పాత్రలతోనే అభిమానుల మనసు దోచుకున్నారు. ఆ తర్వాత మా బాలాజీ, మనోహరం, మనసున్న మారాజు, హనుమాన్ జంక్షన్, ప్రేమించు, మిస్సమ్మ వంటి సినిమాల్లో హీరోయిన్గా మెప్పించి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో కూడా నటించి అలరించారు.
ఆ తర్వాత పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమయ్యారు. కానీ ఆ మధ్యలో 'అమర్ అక్బర్ ఆంటోనీ' చిత్రంలో కనిపించారు. ఇక సోషల్‌మీడియాలో చురుగ్గా ఉంటూ ఎప్పటికప్పుడు ఫొటోలను పోస్ట్ చేస్తుంటారు. ఈ క్రమంలోనే తన కూతురు శ్లోక ఫోటోను షేర్ చేశారు. ఇందులో కూతురిని ముద్దాడుతూ కనిపించారు. ఈ ఫోటోలో లయ కంటే అందంగా, కళగా ఆమె ఉన్నట్లు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇద్దరూ ట్రెడిషనల్‌గా, నిండైన సంప్రదాయంతో ఉన్నారని అంటున్నారు.