తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

వరల్డ్ ఫస్ట్ సింగిల్ షాట్ మూవీ ట్రైలర్ - ఎలా ఉందంటే? - హన్సిక 105 మినిట్స్ ట్రైలర్

Hansika 105 Minutes Trailer : హీరోయిన్​ హన్సిక నటించిన వరల్డ్ ఫస్ట్ సింగిల్ క్యారెక్టర్​, సింగిల్​ షాట్ మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ ప్రచార చిత్రం ఆద్యంతం ఆకట్టుకునేలా థ్రిల్లింగ్​గా సాగింది.

హన్సిక వరల్డ్ ఫస్ట్ సింగిల్ షాట్ మూవీ ట్రైలర్ - ఎలా ఉందంటే?
హన్సిక వరల్డ్ ఫస్ట్ సింగిల్ షాట్ మూవీ ట్రైలర్ - ఎలా ఉందంటే?

By ETV Bharat Telugu Team

Published : Jan 18, 2024, 9:30 PM IST

Updated : Jan 19, 2024, 7:18 AM IST

Hansika 105 Minutes Trailer : హీరోయిన్ హన్సిక ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్​ మూవీ '105 మినిట్స్‌'. రాజు దుస్స దర్శకత్వం వహించారు. బొమ్మ కె శివ నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రం జనవరి 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన మోషన్‌ పోస్టర్‌, ఫస్ట్ గ్లింప్స్, టీజర్ ఆడియెన్స్​ను బాగానే ఆకట్టుకున్నాయి. అయితే విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో మేకర్స్ తాజాగా ట్రైలర్​ను రిలీజ్ చేశారు.

ట్రైలర్ ప్రారంభంలో హన్సిక ఓ పెద్ద బంగ్లాలో ఉండటాన్ని చూపించారు. ఆ తర్వాత ఇంట్లో, అడవిలో ఒంటరిగా తిరుగుతున్న ఆమెను ఏదో ఒక అదృశ్య శక్తి భయ పెట్టడంతో పాటు చంపేందుకు ప్రయత్నిస్తుండటం వంటివి చూపించారు. ఈ క్రమంలోనే ఆమె ఆ సమస్య నుంచి బయటపడలేక తనను తానే హింసించుకుంటుంది. గొంతుకు చైన్ చుట్టుకుని మరీ చనిపోయేందుకు ప్రయత్నిస్తుంది. అంతేకాదు, కత్తితో గొంతును కోసుకునే ప్రయత్నం కూడా చేస్తుంది. మరి ఇంతకీ ఆమెను వెంటాడే శక్తి ఏంటి? దాని నుంచి ఆమె ఎలా బయటపడింది? అనేది తెరపై చూడాల్సిందే!

ఓటీటీలోకి హిట్ సినిమా :మలయాళ స్టార్ హీరో మోహన్‌లాల్‌ కీలక పాత్రలో రూపొందిన కోర్టు రూమ్‌ డ్రామా 'నేరు'. జీతూ జోసెఫ్‌ దర్శకుడు. డిసెంబరు 21న మలయాళంలో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. రూ.80 కోట్లకుపైగా వసూళ్లను అందుకుంది. మోహన్‌లాల్‌, ప్రియమణి, అనస్వర రాజన్‌ నటన సినిమాకు బాగా హైలైట్‌గా నిలిచింది. ఇప్పుడీ చిత్రం ప్రముఖ ఓటీటీ వేదికగా డిస్నీ+హాట్‌స్టార్‌ వేదికగా జనవరి 23వ తేదీ నుంచి అందుబాటులోకి రానుంది. గతంలో మోహన్‌లాల్‌-జీతూ జోసెఫ్‌ కాంబినేషన్‌లో వచ్చిన 'దృశ్యం' చిత్రాలు ఎంతటి ఘన విజయాన్ని అందుకున్నాయో తెలిసిన విషయమే. దీంతో ఈ చిత్రంపైనా అంతే అంచనాలు పెట్టుకున్నారు ప్రేక్షకులు. వాటిని నిజం చేస్తూ 'నేరు' మలయాళంలో సూపర్​ హిట్‌ టాక్‌ను దక్కించుకుంది. ఇతర భాషా ప్రేక్షకులు ఈ చిత్రం కోసం వేచి చూసేలా చేసింది.

థ్రిల్లర్​ గ్లింప్స్​ : డేంజరస్ వైఫ్​గా ప్రియమణి - ఇన్వెస్టిగేటివ్‌ జర్నలిస్ట్​గా భూమి పెడ్నేకర్

పవన్ సాంగ్​కు నిహారిక - లావణ్య త్రిపాఠి డ్యాన్స్ - అదిరింది!

Last Updated : Jan 19, 2024, 7:18 AM IST

ABOUT THE AUTHOR

...view details