Viswaksen Prank video: 'అశోకవనంలో అర్జునకళ్యాణం' చిత్ర ప్రచారం కోసం చేసిన ప్రాంక్ వీడియోపై విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఆ చిత్ర కథానాయకుడు విశ్వక్ సేన్ స్పందించారు. కేవలం చిత్ర ప్రచారం కోసం మాత్రమే ఆ వీడియో చేశామని, ఎలాంటి దురుద్దేశం లేదని వివరణ ఇచ్చారు. మే 6న అర్జున కళ్యాణం విడుదల సందర్భంగా చిత్ర బృందం ప్రత్యేకంగా సమావేశమై ఆ చిత్ర విశేషాలను పంచుకున్నారు.
ఈ సందర్భంగా ఇటీవల జరిగిన వివాదాలపై వివరణ ఇచ్చిన విశ్వక్ సేన్... ఓ టీవీ ఛానల్ యాంకర్ తో జరిగిన విభేదాలకు సంబంధించి బుధవారం ప్రత్యేక వీడియో విడుదల చేయనున్నట్లు స్పష్టం చేశారు. సినిమాను జనాలకు చేరువ చేసేందుకు మాత్రమే తాను ప్రయత్నాలు చేస్తాను తప్ప వ్యక్తిగతంగా ఎలాంటి దురుద్దేశం లేదని విశ్వక్ సేన్ తెలిపారు.