తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

నాలుగు రోజుల్లోనే 'దాస్ కా ధమ్కీ' బ్రేక్ ఈవెన్.. విశ్వక్​ క్రేజ్ మామూలుగా లేదుగా! - విశ్వక్​ సేన్​ లేటెస్ట్​ వార్తలు

విశ్వక్​ సీన్​ హీరోగా నటించి.. దర్శకత్వం వహించిన 'దాస్​ కా ధమ్కీ' సినిమా వసూళ్లు.. ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్​టాపిక్​గా మారాయి. నాలుగు రోజుల్లోనే ఈ సినిమా బ్రేక్​ ఈవెన్​ పూర్తి చేసుకుంది. ఆ వివరాలు మీకోసం.

hero vishwak sen das ka dhamki movie collections completed break even in four days
hero vishwak sen das ka dhamki movie collections completed break even in four days

By

Published : Mar 26, 2023, 2:11 PM IST

విశ్వక్​ సేన్ హీరోగా నటిస్తూనే దర్శకత్వం వహించిన తాజా చిత్రం 'దాస్ కా ధమ్కీ'. గతంలో విశ్వక్ సేన్ హీరోగా నటిస్తూ డైరెక్ట్ చేసిన 'ఫలక్​నామా దాస్' సూపర్ హిట్ కావడంతో అదే ధైర్యంతో తన డైరెక్షన్​లో ఈ సినిమా కూడా చేశారు.​ అయితే ఈ మూవీ నాలుగు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ పూర్తి చేయడం ప్రస్తుతం టాలీవుడ్​లో హాట్​ టాపిక్​గా మారింది. ఎవరూ ఊహించని విధంగా టాక్ తెచ్చుకున్న ఈ సినిమా కలెక్షన్ల విషయంలో దూసుకుపోతోంది.

ట్రేడ్​ వర్గాల సమాచారం ప్రకారం.. మొదటి రోజు ఈ సినిమా రూ. మూడు కోట్ల ఆరు లక్షలు వసూలు చేసింది. రెండో రోజు రూ.కోటి ఐదు లక్షలు, మూడో రోజు రూ.కోటి రెండు లక్షలు, నాలుగో రోజు రూ.కోటి 22 లక్షల వసూలు చేసింది. శనివారం కావడంతో నాలుగో రోజు వసూళ్లు కలిసి వచ్చాయి. అలా రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.ఆరు కోట్ల 35 లక్షల షేర్ వసూలు చేసిన ఈ సినిమా.. సుమారు రూ.11 కోట్లకుపైగా గ్రాస్ వసూలు చేసింది.

  • రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా కలెక్షన్లు..
  • నైజాం ప్రాంతం- రూ.64 లక్షలు
  • సీడెడ్​- రూ.18 లక్షలు
  • ఉత్తరాంధ్ర- రూ.14 లక్షలు
  • ఈస్ట్ గోదావరి- రూ.8 లక్షలు
  • వెస్ట్ గోదావరి- రూ. 4 లక్షలు
  • గుంటూరు- రూ. 5 లక్షలు
  • కృష్ణ- రూ. 6 లక్షలు
  • నెల్లూరు- రూ. 3 లక్షలు

ప్రపంచవ్యాప్తంగా నాలుగు రోజులకు గాను ఈ సినిమా రూ.8 కోట్లకు పైగా షేర్​ వసూళ్లు రాబట్టి బ్రేక్ ఈవెన్ టార్గెట్​ను పూర్తి చేసుకుంది. వాస్తవానికి ఈ సినిమా బిజినెస్ 7.30 కోట్లకు జరిగిందట. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్​గా రూ. ఎనిమిది కోట్లు నిర్ణయించారట. ఇప్పటికే 37 లక్షల లాభంతో ఈ సినిమా దూసుకుపోతోంది.

రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా.. ఉగాది పండుగను పురస్కరించుకుని మార్చి 22వ తేదీన విడుదలైంది. అయితే ముందుగా నరేశ్​ అనే మరో దర్శకుడితో ఈ సినిమా ప్రారంభించారు విశ్వక్​. కానీ ఎందుకో నరేశ్​ సరిగ్గా సినిమాను డీల్ చేయడం లేదనిపించి ఆయనను తప్పించి విశ్వక్​ సేన్ మెగా ఫోన్ పట్టుకున్నారు. నివేదా పేతురాజ్ హీరోయిన్​గా నటించిన ఈ సినిమాను సొంత డబ్బులు పెట్టి నిర్మించారు విశ్వక్​.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details