తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

బిచ్చగాడు-2 రిలీజ్​ డేట్​ వచ్చేసిందోచ్​.. ఎప్పుడంటే..? - హిరో విజయ్ ఆంటోనీ బిచ్చగాడు 2 సినిమా రిలీజ్​ డేట్​

బిచ్చగాడు-2 మూవీ​కి సంబంధించి ఓ కీలక అప్డేట్​ వచ్చింది. ట్రైలర్​తో పాటు సినిమా విడుదల తేదీలను ప్రకటించింది చిత్రబృందం. ఇంతకీ రిలీజ్ డేట్ ఎప్పుడంటే..

Hero Vijay Antony Bichagadu 2 Movie Release date
హిరో విజయ్ ఆంటోనీ బిచ్చగాడు 2 సినిమా రిలీజ్​ డేట్​

By

Published : Apr 28, 2023, 8:53 PM IST

'బిచ్చగాడు' సీక్వెల్​కు సంబంధించి ఓ కీలక అప్డేట్​ ఇచ్చింది మూవీ టీమ్​. సినిమా ట్రైలర్​ సహా రిలీజ్​ డేట్​ను అనౌన్స్​ చేశారు మూవీ మేకర్స్. 'బిచ్చగాడు-2' ట్రైలర్‌ను ఏప్రిల్ 29న ఉదయం 11 గంటలకు విడుదల చేసేందుకు ప్లాన్​ చేశారు. అలాగే మే 19న మూవీని విడుదల చేయనున్నట్లు ప్రకటించారు నిర్మాతలు. ఇటు తెలుగుతో పాటు అటు తమిళంలోనూ ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు.

నటుడు విజయ్ ఆంటోనీ నటించిన 'బిచ్చగాడు' సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎందుకంటే దక్షిణాదిలో మంచి హిట్​ రెస్పాన్స్​ను అందుకుందీ చిత్రం. 2016లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్​ వద్ద కలెక్షన్ల సునామీని సృష్టించింది. ఇప్పటికే రిలీజైన బిచ్చగాడు-2లోని పాటలు ఆడియన్స్​ను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. వాస్తవానికి ఈ సినిమా ఈనెల 14న ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కానీ, అనుకోని కారణాలతో విడుదల తేదీ వాయిదా పడింది.

ఆయనే హీరో, దర్శకుడు, నిర్మాత
ముందుగా 'బిచ్చగాడు-2' సీక్వెల్‌కు ప్రముఖ తమిళ డైరెక్టర్​ ప్రియ కృష్ణస్వామి దర్శకత్వం వహిస్తారని అంతా అనుకున్నారు. కానీ పలు వ్యక్తిగత కారణాల వల్ల ఆమె ఈ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. దీంతో ఈ సినిమాకి హీరోగా, స్వీయ దర్శకుడిగా, నిర్మాతగా కూడా కోలీవుడ్​ స్టార్​ నటుడు విజయ్​ ఆంటోనీనే వ్యవహరించారు. ఈ సినిమాను విజయ్​ ఆంటోనీ ఫిల్మ్స్​ కార్పోరేషన్​ బ్యానర్‌పై భార్య ఫాతిమా, విజయ్​ ఆంటోనీ కలిసి రూపొందించారు. కావ్య తపర్, రాధా రవి, యోగి బాబు, జాన్​ విజయ్​, హరిష్​ పేరడి తదితరులు ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మూవీకి సంబంధించి కథ, దర్శకత్వంతో పాటు సంగీతం, ఎడిటింగ్​ విభాగాలన్నీ విజయ్​ ఆంటోనీనే దగ్గరుండి చూసుకోటం విశేషం.

గ్యాంగ్​స్టర్​గా బిచ్చగాడు..
బిచ్చగాడు పార్ట్​-1లో బిజినెస్​మ్యాన్​ రోల్​లో నటించిన విజయ్​. తన తల్లి ఆరోగ్యం కోసం ఓ స్వామిజీని ఆశ్రయిస్తాడు. ఆయన సలహా మేరకు బిచ్చగాడిగా మారి 40 రోజుల పాటు దీక్ష చేసి తల్లి ప్రాణాలను కాపాడుకుంటాడు. అయితే రానున్న సీక్వెల్​లో విజయ్ ఆంటోని ఓ గ్యాంగ్‌స్టర్ క్యారెక్టర్​లో కనిపించనున్నారని తెలుస్తోంది. మరి గ్యాంగ్‌స్టర్ బిచ్చగాడిగా ఎందుకు.. ఎలా మారాడనేది చిత్ర ప్రధాన కథాంశంగా ఉండనుంది.

షూటింగ్​లో విజయ్​కు గాయాలు..
ఈ చిత్ర షూటింగ్​ సమయంలో విజయ్​ ఆంటోనీ గాయపడ్డారు. జనవరిలో మలేషియాలో జరిగిన బిచ్చగాడు-2 సినిమా చిత్రీకరణలో ఆయన ప్రమాదానికి గురయ్యారు. దీంతో విజయ్​ దవడ, ముక్కు భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. సర్జరీ తర్వాత తన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు విజయ్​ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details