నైట్రో స్టార్ సుధీర్ బాబు నటిస్తున్న తాజా సినిమా 'మామా మశ్చీంద్ర'. ఈ సినిమాకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఇచ్చారు సుధీర్ బాబు. ఏప్రిల్ 14న ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను రిలీజ్ చేయనున్నట్టు తెలియజేశారు. ఈ సందర్భంగా సుధీర్ బాబు, దర్శకుడు హర్షవర్ధన్ ఓ వీడియో కూడా రిలీజ్ చేశారు. అయితే, ఇందులో వారు ఈ సినిమాకు 'మామా మశ్చీంద్ర' టైటిల్ ఉంచాలా లేదా 'మాయ మశ్చింద్ర'గా మార్చాలా అనే గందరగోళంలో ఉన్నారు. అంతా ఈ సినిమా టైటిల్‌ను 'మాయ మశ్చీంద్ర' అని తప్పుగా చదువుతున్నారని, దాన్ని ఆ టైటిల్‌కు మార్చేద్దామని హర్షవర్ధన్ అంటే.. సుధీర్ మాత్రం టైటిల్ మార్చొద్దని పట్టుబట్టడం ఈ వీడియోలో చూడవచ్చు. అయితే, టీజర్ రిలీజైన తర్వాత ప్రేక్షకులే ఏ టైటిల్ ఉంచాలో నిర్ణయిస్తారని తెలిపారు. టీజర్‌లో చూసిన తర్వాత ఆ సినిమాకు మామా మశ్చీంద్ర అనే టైటిల్ ఎందుకు పెట్టాల్సి వచ్చిందో గెస్ చేసి చెబితే బహుమతి ఇస్తారట. ఫస్ట్ పది మందికి మాత్రమే ఈ ప్రైజ్ లభిస్తుందని స్పష్టం చేశారు.
సుధీర్ సినిమాకు 'మామా మశ్చీంద్ర' టైటిల్ ఎందుకు? టీజర్ చూసి చెబితే స్పెషల్ ప్రైజ్! - సుధీర్ బాబు టీజర్ రిలీజ్ డేట్
సుధీర్ బాబు లేటెస్ట్ చిత్రం 'మామా మశ్చీంద్ర' టీజర్ రిలీజ్ అప్డేట్ వచ్చింది. ఏప్రిల్ 14న టీజర్‌ను విడుదల చేయనున్నట్టు మేకర్స్ వెల్లడించారు. దీంతో పాటు ఓ స్పెషల్ ఆఫర్ ప్రకటించారు. టీజర్ చూసి 'మామా మశ్చీంద్ర' టైటిల్ ఎందుకు పెట్టామో చెబితే సూపర్ ప్రైజ్ ఇస్తామని తెలిపారు.
రొటీన్ కథలకు గుడ్ బై చెప్పి.. వెరైటీ స్టోరీలపై దృష్టి పెట్టారు హీరో సుధీర్ బాబు. అందులో భాగంగానే 'మామా మశ్చీంద్ర' మూవీకి ఓకే చేశారు. హర్షవర్ధన్ దర్శకత్వం వహించిన 'మామా మశ్చీంద్ర'లో సుధీర్ బాబు మూడు విభిన్న లుక్స్‌లో కనిపించనున్నారు. ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ ఇప్పటికే ఫస్ట్ లుక్, గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఇందులో సుధీర్ బాబు సిక్స్ ప్యాక్ బాడీతో కనపడగా, ఫస్ట్ లుక్‌లో పూర్తి భిన్నంగా కనిపించారు. వాటిలో ఒకటి దుర్గ కాగా, మరొకటి పరశురామ్, ఇంకోటి డీజే.
మారుతీ డైరెక్షన్లో వచ్చిన 'ప్రేమ కథా చిత్రమ్' సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీలో మంచి హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు హీరో సుధీర్ బాబు. ఈ మూవీ అప్పట్లో భారీ హిట్ అవ్వడమే కాకుండా బాక్సాఫీస్ వద్దా మంచి కలెక్షన్లు రాబట్టింది. ఆ తర్వాత చాలా సినిమాలు చేసినా.. హిట్ మాత్రం కలిసి రాలేదు. 'సమ్మోహనం' మూవీతో మంచి క్రేజ్ తెచ్చుకున్నా.. దాన్ని నిలుపుకునేందుకు చాలానే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత మళ్లీ చాలా రోజులకు ఇటీవల సుధీర్ బాబు హీరోగా మహేశ్ సూరపనేని దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ చిత్రం 'హంట్'. ఈ సినిమా భారీ హైప్ తో, భారీ అంచనాల మధ్య రిలీజైనా.. బాక్సాఫీస్ వద్ద నిరాశే మిగిల్చింది. ఆ తర్వాత ఈ సినిమా రిలీజైన రెండు వారాల్లోనే మేకర్స్ ఓటీటీలో విడుదల చేశారు.