RC16 Announcement: మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ 16వ సినిమాను సోమవారం అఫీషియల్‌గా అనౌన్స్‌చేశారు. ఈ సినిమాకు బుచ్చిబాబు దర్శకత్వం వహించనున్నారు. ఉప్పెన సినిమాతో దర్శకుడిగా టాలీవుడ్‌లో అరంగేట్రం చేసిన బుచ్చిబాబు రెండో సినిమాతోనే బంపర్ఆఫర్ను అందుకున్నారు. కొన్నిసార్లు తిరుగుబాటు అవసరమంటూ ఈ సినిమా అనౌన్స్‌మెంట్ పోస్టర్‌పై ఉన్న క్యాప్షన్ ఆసక్తి పెంచుతోంది. పవర్‌ఫుల్ సబ్జెక్ట్‌తో పాన్ ఇండియన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందనున్నట్లు మేకర్స్ తెలిపారు.
'కొన్నిసార్లు తిరుగుబాటు అవసరమే'.. 'RC 16' అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసిందోచ్.. - రామ్‌చరణ్ బుచ్చిబాబు
RC16 Announcement: హీరో రామ్‌చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కలయికలో రూపొందనున్న పాన్ ఇండియన్ సినిమాను సోమవారం అధికారికంగా అనౌన్స్‌చేశారు. పవర్‌ఫుల్ సబ్జెక్ట్‌తో ఈ సినిమా తెరకెక్కించబోతున్నట్లు ప్రకటించారు.
జనవరి నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభంకానున్నట్లు సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్ సమర్ఫణలో సుకుమార్ రైటింగ్స్, వృద్ధి సినిమాస్ పతాకాలపై వెంకట సతీష్ కిలారు ఈ పాన్ ఇండియన్ సినిమాను నిర్మించబోతున్నారు. కథానాయికతో పాటు మిగిలిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాల్ని త్వరలో వెల్లడించే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.
తొలుత తన 16వ సినిమాను జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరితో చేయబోతున్నట్లు రామ్‌చరణ్ ప్రకటించారు. కానీ అనివార్య కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ వర్కవుట్ కాలేదు. ఆయన స్థానంలో బుచ్చిబాబుతో సినిమా చేయబోతున్నారు చెర్రీ. మరోవైపు ఉప్పెన తర్వాత బుచ్చిబాబు కూడా ఎన్టీఆర్‌తో సినిమా చేయనున్నట్లు ప్రచారం జరిగింది. కానీ కొరటాల శివ, ప్రశాంత్ నీల్‌తో ఎన్టీఆర్ కమిట్‌మెంట్స్ ఉండటంతో రెండేళ్ల వరకు డేట్స్ దొరకడం కష్టమే. అందుకే రామ్‌చరణ్ సినిమాకు బుచ్చిబాబు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.