Ram potineni Marriage: టాలీవుడ్ బ్యాచిలర్స్రో ఒకరైన హీరో రామ్పోతినేని.. త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని సమాచారం. తన చిన్ననాటి స్నేహితురాలు, స్కూల్మేట్ను వివాహం చేసుకోనున్నట్లు ప్రచారం సాగుతోంది. కొంతకాలం నుంచి వీరు ప్రేమలో ఉన్నారని, వివాహ బంధంతో ఒక్కటవ్వాలని నిర్ణయించుకున్నారట.
త్వరలోనే పెళ్లి పనులు మొదలుపెట్టేందుకు రామ్ సన్నద్ధమవుతున్నారని, కుటుంబసభ్యుల సమక్షంలో ఈ వేడుక జరగనుందని వార్తలు వస్తున్నాయి. ఆగస్టులో నిశ్చితార్థం, నవంబరులో పెళ్లి జరగొచ్చని ప్రచారం సాగుతోంది. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే హీరో స్పందించే వరకు వేచి ఉండాల్సిందే.