దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన అద్భుత కావ్యం 'ఆర్‌ఆర్‌ఆర్' పేరు.. అంతర్జాతీయ వేదికలపై మార్మోగుతోంది. సినిమాలకు సంబంధించి ఎలాంటి అవార్డులు ప్రకటించినా.. ఆ జాబితాలో 'ఆర్‌ఆర్‌ఆర్' పేరు కచ్చితంగా ఉంటుంది. తాజాగా హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డులు ప్రకటించింది. అందులో కూడా ఆర్‌ఆర్‌ఆర్ చిత్రం సత్తా చాటింది. బ్లాక్ పాంథర్, ది వుమెన్ కింగ్, ది బ్యాట్ మ్యాన్ వంటి హాలీవుడ్ చిత్రాలను వెనక్కి నెట్టి.. 'బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్', 'బెస్ట్ స్టంట్స్', 'బెస్ట్ యాక్షన్ మూవీ', 'బెస్ట్ ఒరిజినల్ సాంగ్' విభాగాల్లో అవార్డులను సొంతం చేసుకుంది.
RRR హవా.. చరణ్ ఇంట్రెస్టింగ్ ట్వీట్.. బ్రదర్ ఎన్టీఆర్ అంటూ.. - హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డులు న్యూస్
'ఆర్‌ఆర్‌ఆర్' చిత్రంతో మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్.. అంతర్జాతీయంగా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. తాజాగా ఆయన చేసిన ఓ ట్వీట్.. సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.
వాటితో పాటు క్రిటిక్ ఛాయిస్ సూపర్ అవార్డులో యాక్షన్ మూవీ విభాగంలో ఉత్తమ నటుడు క్యాటగిరీలో రామ్‌చరణ్, ఎన్టీఆర్ పేర్లు ఉన్నాయి. హాలీవుడ్ స్టార్ హీరోలు టామ్ క్రూజ్, బ్రాడ్ పిట్లతో ఎన్టీఆర్, చరణ్ పోటీ పడుతున్నారు. ఈ విషయాన్ని మరోసారి గుర్తు చేస్తూ రామ్‌చరణ్ ఆసక్తికర ట్వీట్ చేశారు. "క్రిటిక్స్ ఛాయిస్ అవార్డ్స్‌లో బెస్ట్ యాక్టర్ ఇన్ యాక్షన్ మూవీ విభాగంలో టామ్ క్రూజ్, బ్రాడ్ పిట్ లాంటి దిగ్గజ నటులతో పాటు నా పేరు, నా బ్రదర్ ఎన్టీఆర్ పేరు కలిసి చూడడం ఆనందంగా ఉంది" అని చరణ్ ట్వీట్ చేశాడు.
'ఆర్‌ఆర్‌ఆర్' చిత్రంలో రామ్ చరణ్ పాత్రకు మంచి రెస్పాన్స్ రావడంతో.. ఈ సారి ఆ అవార్డు పక్క రామ్ చరణ్‌కు వస్తుందని సినీ పండితులు అభిప్రాయపడుతున్నారు. కాగా, ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా రూపొందిన ఆర్‌ఆర్‌ఆర్ చిత్రానికి రాజమౌళి దర్శకత్వం వహించగా, డీవీవీ దానయ్య నిర్మించారు. ఆలియాభట్, అజయ్ దేవగణ్, శ్రియ, ఒలివియా మోర్రీస్ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా గతేడాది మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై భారీ విజయాన్ని సాధించింది. ఏకంగా రూ.1200కోట్లు వసూలు చేసింది.