తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

కార్తికేయ2 పై పవన్​ ప్రశంసల జల్లు, సంబర పడిపోతున్న నిఖిల్‌ - కార్తికేయ2 కలెక్షన్స్

Pawan kalyan on karthikeya 2 చిన్న చిత్రంగా విడుదలై బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షాన్ని కురిపిస్తోన్న కార్తికేయ 2 పై ప్రశంసలు కురిపించారు హీరో, జనసేన అధినేత పవన్​కల్యాణ్​. దీనికి సంబంధించిన వీడియోను నిఖిల్‌, అనుపమ పరమేశ్వరన్‌ సోషల్ మీడియాలో పంచుకుంటూ ఆనందంతో ఉబ్బితబ్బిబయ్యారు.

Pawan kalyan on karthikeya 2
Pawan kalyan on karthikeya 2

By

Published : Aug 22, 2022, 6:47 AM IST

Pawan kalyan on karthikeya 2: ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాదు, ఉత్తరాదిలోనూ సంచలన విజయంతో దూసుకుపోతోంది 'కార్తికేయ2'. చిన్న చిత్రంగా విడుదలై బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షాన్ని కురిపిస్తోంది. నిఖిల్‌ కథానాయకుడిగా చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా హీరో, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ తన ప్రసంగంలో 'కార్తికేయ2'ను ప్రస్తావించారు. ఆ చిత్రంపై ప్రశంసలు కురిపించారు.

"కార్తికేయ' అనే సినిమా వచ్చి దేశమంతా దుమ్ము దులిపేస్తోంది. నిఖిల్‌ అనే హీరో. నేను మార్పు రావాలని కోరుకుంటాను. ఇదే మార్పంటే..! ఇది మాది అనుకోవడానికి లేదు. అందరూ రావాలి" అంటూ పవన్‌కల్యాణ్‌ మాట్లాడిన వీడియో ఇప్పుడు వైరల్‌ అవుతోంది. ఈ వీడియోను నిఖిల్‌, అనుపమ పరమేశ్వరన్‌ సోషల్ మీడియాలో పంచుకుంటూ ఆనందంతో ఉబ్బితబ్బిబయ్యారు. 'ఇంతకన్నా ఇంకేమైనా అవసరమా? థ్యాంక్స్‌ సర్‌.. ఇది చాలు మాకు' అంటూ నిఖిల్‌ రాసుకొచ్చాడు.

ఆగస్టు 13న విడుదలైన 'కార్తికేయ2' బాలీవుడ్‌లో కలెక్షన్లతో దూసుకుపోతోంది. తొలి రోజు 50 థియేటర్‌లలో విడుదలైన ఈ సినిమా ఇప్పుడు దాదాపు 1500లకు పైగా స్క్రీన్‌లపై ప్రదర్శితమవుతోంది. ఇక ఇప్పటివరకూ హిందీలో మొత్తం రూ.11.25 కోట్ల వసూళ్లు సాధించినట్లు సినీ విశ్లేషకుడు తరుణ్‌ ఆదర్శ్‌ పేర్కొన్నారు. తొలి రోజు కేవలం రూ.7లక్షలు వసూలు చేసిన సినిమా పది రోజుల్లో రూ.11కోట్లు వసూలు చేయడం విశేషం. మొత్తంగా ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా వారం రోజుల షేర్ రూ.26 కోట్లు దాటింది. ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగితే రూ.50కోట్లు వసూలు చేయడం పెద్ద విషయమేమీ కాదు. ఈ చిత్ర థియేట్రికల్ హక్కులను రూ.14 కోట్లకు విక్రయించగా, తొలి వారంలోనే డబుల్‌ షేర్‌ రాబట్టింది. దీన్ని బట్టి ఈ చిత్రం ఎంత పెద్ద హిట్టో అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ చిత్రంలో బాలీవుడ్‌ నటుడు అనుపమ్‌ ఖేర్‌తో పాటు హాస్య నటులు శ్రీనివాసరెడ్డి, వైవా హర్ష తదితరులు నటించారు. కృష్ణతత్వాన్ని బోధిస్తూ మిస్టరీ థ్రిల్లర్‌గా 'కార్తికేయ2' తెరకెక్కింది.

ఇవీ చదవండి:చిరు, మణిరత్నం కాంబోలో సినిమా, నిజమేనా

చిరు ఫ్యాన్స్​కు మరో గుడ్​న్యూస్, గాడ్​ ఫాదర్ టీజర్ వచ్చేసింది

ABOUT THE AUTHOR

...view details