తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

ఆ బాలీవుడ్ బ్యూటీ అంటే చాలా ఇష్టం.. ఆమెతో పనిచేయాలని ఉంది!: నాని - ఆమిర్​ ఖాన్​ గురించి నాని

నేచురల్​ స్టార్​ ప్రస్తుతం దసరా మూవీ ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో బాలీవుడ్​లో సందడి చేస్తున్న నాని.. ఓ ఇంటర్వ్యూలో పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్​ చేశారు. ఇంతకీ ఆయన ఏమన్నారంటే?

nani dasara promotions
natural star nani

By

Published : Mar 29, 2023, 10:16 AM IST

టాలీవుడ్​ నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం తన లేటెస్ట్​ మూవీ 'దసరా' ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. గోదావరిఖనిలోని సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పాన్​ ఇండియా లెవెల్​లో మార్చి 30ను విడుదలకు సిద్ధం కానుంది. ఇప్పటికే ఈ సినిమాపై సర్వత్రా హైప్ క్రియేట్ అయింది. ఇక హీరో నాని కూడా ఈ సినిమాను ఆల్​ ఇండియా లెవెల్​లో ప్రమోట్​ చేసే పనుల్లో నిమగ్నమైపోయారు. ముఖ్యంగా నార్త్ ఆడియెన్స్‌ను ఆకర్షించేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా బీటౌన్​లో తిరుగుతూ ఫ్యాన్స్​తో ముచ్చటిస్తున్న నేచురల్​ స్టార్​.. అక్కడి మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. హిందీలో తనకు నటించే ఛాన్స్ వస్తే దీపికా పదుకొణె, ఆమీర్‌ ఖాన్‌తో నటించాలని కోరికగా ఉందని స్పష్టం చేశారు. "నేను దీపికా పదుకొణెతో పనిచేసేందుకు ఇష్టపడతాను. ఆమె ఓ అద్భుతమైన నటి. అవకాశం వచ్చి మంచి కథ దొరికితే కచ్చితంగా ఆమె సరసన నటించడానికి సిద్ధంగా ఉన్నాను. అలాగే బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరాణితో పనిచేయాలని కోరుకుంటున్నాను. ఆయన సినిమాలంటే నాకు చాలా ఇష్టం" అంటూ నాని చెప్పుకొచ్చారు.

అలాగే బాలీవుడ్‌లో ఏ హీరోతో పనిచేయాలని ఉందని యాంకర్​ అడగ్గా.. దానికి ఆమిర్ ఖాన్ అని బదులిచ్చారు. ఆయన సినిమాలను బాగా ఎంజాయ్ చేస్తానని తెలిపారు. ఇక తన భార్య అంజనా గురించి మాట్లాడుతూ.. ఆమెకు కూడా సినిమాలంటే ఇష్టం అని చెప్పారు. "నా వైఫ్​కు సినిమాలంటే చాలా ఇష్టం. ఇక నా సినిమాలను రిలీజ్ రోజు మార్నింగ్ షోకు వెళ్లి మరి చూస్తుంటుంది. ఆడియన్స్​తో పాటు మూవీ చూడమంటే తనకు చాలా ఇష్టం. దసరా సినిమా తర్వాత నా నెక్స్ట్​ ప్రాజెక్ట్​లో నేను ఓ ఆరేళ్ల పాపకు తండ్రిగా కనిపిస్తాను. అది పూర్తిగా విభిన్నమైన సినిమా. నేను దసరాలో చేసిన రోల్​కు నా తర్వాత పాత్రకు అసలు పొంతనే ఉండదు. పూర్తిగా భిన్నమైన చిత్రాన్ని చేస్తున్నా" అని నాని తెలిపారు.

ఇన్నాళ్లు సోలోగా మూవీని ప్రమోట్​ చేస్తున్న నానికి తోడుగా ఇప్పుడు హీరోయిన్​ కీర్తి సురేశ్​, మరో నటుడు దీక్షిత్​ శెట్టి ముందుకొచ్చారు. ఇక వీరి ముగ్గురితో ప్రమోషన్లలోనే దసరా పండుగ వచ్చేసిందన్నట్టుగా అనిపించిందని అభిమానులు అంటున్నారు. కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్న దసరా మూవీ పీరియాడికల్ యాక్షన్ జోనర్‌లో సిల్వర్​ స్క్రీన్​పై సందడి చేయనుంది. సుధాకర్ చెరుకూరి నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రంలో సముద్రఖని కీలక పాత్ర పోషించారు. మలయాళ నటుడు టామ్ చాకో ప్రతినాయకుడి పాత్రను పోషిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details