తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

అవును మందు కొట్టి నటించాను: నాని షాకింగ్ కామెంట్స్​! - దసరాలో మందు తాగి నటించిన నాని

'దసరా' సినిమాలోని కొన్ని సన్నివేశాల్లో నిజంగానే మందు తాగి నటించినట్లు నేచురల్​ స్టార్ నాని షాకింగ్ కామెంట్స్​ చేశారు. ఆ వివరాలు..

dasara movie
అవును మందు కొట్టి నటించాను: నాని షాకింగ్ కామెంట్స్​!

By

Published : Mar 20, 2023, 10:24 PM IST

Updated : Mar 20, 2023, 10:42 PM IST

కొద్ది కాలంగా చిత్రసీమలో ఎన్నో మార్పులు వచ్చాయి. ముఖ్యంగా నటీనటుల్లోనూ మరింత ఎక్కువగా మార్పులు వచ్చాయి. కథ డిమాండ్ చేస్తే ఏదైనా చేసేందుకు సిద్ధమవుతున్నారు. రిస్క్ సీన్స్​ అయినా డూప్​ లేకుండానే చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే సినిమా కోసం హీరో మందు కొట్టి నటించడం ఎప్పుడైనా విన్నారా? అవును మీరు విన్నది నిజమే. టాలీవుడ్​లో నేచురల్ స్టార్​గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నాని.. దసరా మూవీ కోసం కొన్ని సన్నివేశాల్లో ఏకంగా మందు కొట్టి నటించారట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు. దసరా మూవీ ప్రమోషన్స్​లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన.. చిత్రం గురించి పలు ఆసక్తికర విషయాలను తెలిపారు. ఇందులో భాగంగానే 'దసరా చిత్రంలో కొన్ని సన్నివేశాలు మందు కొట్టి నటించారని టాక్ వినిపిస్తోంది. దానిపై మీరు ఏమంటారు?' అని ఓ విలేకరి అడగగా.. నాని ఈ సమాధానం ఇచ్చారు.

"సినిమాలో కొన్ని సన్నివేశాల్లో మందు కొట్టి నటించాలని దర్శకుడు శ్రీకాంత్​ ఓదెల చెప్పాడు. మీకేమైనా అభ్యంతరం ఉందా? అని అడిగారు. నాకేం లేదని చెప్పాను. అలాగే కావాల్సిన సన్నివేశాల్లో లైట్​గా మందు తాగి నటించాను. కొన్ని సీన్స్​లో కళ్లు ఎర్రగా, మందు కొట్టిన వ్యక్తిలా కనిపించాలి.. అందుకు గ్లిజరిన్ కూడా వాడొచ్చు. కానీ నేచురాలిటీ కోసం.. కథ డిమాండ్ చేయడంతో నటించాను" అని నాని షాకింగ్ ఆన్సర్​ ఇచ్చారు. ఇక ఈ చిత్రం కోసం దర్శకుడు నన్ను కావాల్సినంత వాడుకున్నారంటూ నవ్వులు చిందించారు నాని. అంతేకాకుండా ఈ మూవీలో మ్యూజిక్ పై ప్రత్యేక శ్రద్ధ చూపించినట్లు వెల్లడించారు. చిత్రంలో హీరో, హీరోయిన్ పేర్లు ధరణి, వెన్నెల అనుకునే దర్శకుడు పెట్టారని పేర్కొన్నారు.

ఇక దసరా సినిమా విషయానికొస్తే.. తెలంగాణలోని ఓ పల్లెటూరి నేపథ్యంలో మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్​గా రూపొందింది. మార్చి 30న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్​గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలోనే నాని జోరుగా ప్రమోషన్స్​లో పాల్గొంటున్నారు. సుధాకర్‌ చెరుకూరి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కీర్తి సురేష్‌ హీరోయిన్​. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ కానుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్, ట్రైలర్​ ఆడియెన్స్​ను బాగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా సాంగ్స్​, నాని మ్యానరిజం ఆడియెన్స్​ను బాగా అలరించాయి. దీంతో ఈ సినిమాను చూసేందుకు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇకపోతే ఈ మూవీ తర్వాత మరో రెండు చిత్రాలను నాని లైన్​లో పెట్టేశారు. అందులో 'హిట్​ ది థర్డ్​ కేస్​' ఒకటి.

ఇదీ చూడండి:బాలయ్యతో కాజల్ అగర్వాల్​​.. అఫిషీయల్​ అనౌన్స్​మెంట్​ వచ్చేసిందోచ్​

Last Updated : Mar 20, 2023, 10:42 PM IST

ABOUT THE AUTHOR

...view details