Hero Nani Crush Name : 'దసరా' సినిమా సక్సెస్‌ను ఆస్వాదించిన నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం 'హాయ్ నాన్న' అనే సినిమాలో లీడ్ రోల్లో నటిస్తున్నారు. డిసెంబర్లో విడుదలవ్వనున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్ కుడా వేగవంతం చేశారు. ఇందులో భాగంగా తాజాగా రేడియో జాకీలతో కలిసి ఓ చిట్‌చాట్ నిర్వహించారు. అందులో తాను మొదటిసారి ప్రేమలో ఎప్పుడు పడ్డారో చెప్పారు. అలాగే ప్రస్తుతం తన క్రష్ ఎవరో చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు.
"ప్రేమ అంటే ఏంటో ఇప్పుడు తెలిసింది. కానీ, నేను ప్రేమలో పడింది మాత్రం మూడో తరగతిలోనే. అప్పుడు ఫ్యాన్సీ డ్రెస్ పోటీల్లో సోనీ అనే అమ్మాయి మంచి గౌను వేసుకుని వచ్చింది.అప్పుడు నేనేమో ఆకులు చుట్టుకుని నిలబడ్డాను. కానీ ఇప్పుడు ఆ అమ్మాయి కనిపిస్తే.. ప్రస్తుతం నేనూ మంచి డ్రెస్ వేసుకున్నా కాబట్టి వెళ్లి తనని పలకరిస్తాను" అంటూ సరదాగా చెప్పారు. అయితే కియారా ఖన్నా (హాయ్ నాన్న చైల్డ్ ఆర్టిస్టు) తన ప్రస్తుత క్రష్ అని చెప్పుకొచ్చారు.
"ఒక రోజు కియారా ఖన్నా చక్కగా రెడీ అయి సెట్‌కు వచ్చింది. భలే ముచ్చటగా అనిపించింది. నేను కనుక తన వయసులో ఉంటే తనపై మనసు పారేసుకునే వాడిని. కాబట్టి ప్రస్తుతం నా క్రష్ ఆ పాపనే" అని నాని అన్నారు.