తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

అమలకు ఇచ్చిన మాట కోసం ఇప్పటికీ ఆ పని చేస్తున్న నాగ్​.. ఏంటంటే? - అమలకు నాగార్జున ప్రామిస్​

హీరో నాగార్జున పెళ్లైన కొత్తలో తన భార్య అమలకు ఓ ప్రామిస్​ చేశారట. ఇప్పటికీ దాన్ని పాటిస్తున్నారట. అదేంటంటే.

amala nagarjuna
అమల నాగార్జున

By

Published : Sep 5, 2022, 5:31 PM IST

అక్కినేని నాగేశ్వరావు వారసుడిగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు హీరో నాగార్జున. సుమారుగా 36ఏళ్ల నుంచి విభిన్న పాత్రలు పోషిస్తూ.. ఇప్పటికీ యంగ్ లుక్స్​తో కొడుకులతో పాటు యంగ్ హీరోలకు పోటీ ఇస్తూ సినిమాలు చేస్తున్నారు. మొదటి భార్యతో విడిపోయిన ఆయన నటి అమలను రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి జంట ఎంత అన్యోన్యంగా ఉంటుంది.

అయితే పెళ్లైన కొత్తలో అమల.. నాగార్జునకు ఓ మాట చెప్పిందట. ఆ పని క‌చ్చితంగా చేసి తీరాల్సిందే అంటూ ప్రామిస్ చేయించుకుందట. ఆశ్చర్యం ఏంటంటే.. పెళ్లి అయ్యి ఇన్నాళ్లైనా కూడా నాగార్జున ఇప్పటికీ ఆ పని ఇంకా చేస్తూనే ఉన్నారట.

ఇంతకీ ఆ పని ఏంటంటే.. అమల జంతు ప్రేమికురాలు. అందుకోసం బ్లూ క్రాస్​ను రన్ చేస్తున్నారు. జంతువులకు ఏదైనా అయితే అమలు చూసి తట్టుకోలేరు. అందుకే అమల తన సంపాదనలో కొంత భాగం జంతువుల సంరక్షణ కోసం ఖర్చు చేస్తారు. అదే విధంగా నాగార్జునను కూడా ఏటా తన సంపాదనలో కొంత జంతువుల సంరక్షణకు ఇవ్వాలని కండిషన్ పెట్టారట. దానికి ఓకే చెప్పిన నాగ్​ ఇప్పటికీ ఏటా తన సంపాదనలో కొంత మొత్తాన్ని ఇస్తున్నారట. ఈ విషయం తెలిసిన అభిమానులు అమలపై నాగార్జునకు ఎంత ప్రేమ ఉందో అంటూ కామెంట్ చేస్తున్నారు. అలాగే నాగ్​ది గొప్ప మనసు అని అభినందిస్తున్నారు.

ఇదీ చూడండి: రేణు దేశాయ్ ఫ్యామిలీ​ బ్యాక్​గ్రౌండ్​ తెలుసా?

ABOUT THE AUTHOR

...view details